భౌతిక సమాజం-దాని మూలాలు భౌతిక సమాజం మనస్సు యొక్క సంకల్పాలు, మరియు వాటియొక్క ఫలితాల వలన కొనసాగుతుంది; ఇదే లేకపోతే అందరూ శాంతంగా, సుఖంగా, మరియు ఆనందంగా బ్రతుకు సాగించేవారు. అసలు నేనొక విషయం అడుగుతా ఎందుకు మనిషి సంకల్పించుకోవాలి, మరియు ఎందుకు ఆ ఫలితాలకు అనుగుణంగా (లేక) విరుద్ధంగా ప్రవర్తించాలి. ఇదంతా చూస్తుంటే మనస్సనే పరికరం ప్రతీ మనిషిని తనకు బానిసను చేసుకుని నిమిష, నిమిషానికి చిత్రహింసలు పెడుతూ; అసలు ఈ మనస్సు, మనిషి జీవితాన్నే అంధకారంలోకి తీసుకువెళ్ళి నరక ప్రాయంగా చేస్తుంది. చివరగా, సమాజం-వాటియొక్క మూలాలను గురించి చెప్పుకుంటే అవి: రాజకీయం, వినోదం, మతం, భోగలాలసం, కర్మాగారసమూహం, క్రీడావినోదం, భౌతిక శాస్త్ర విద్య, ధన సంపాదన, విత్త విశ్లేషణ; ఇవన్నీ మనిషి యొక్క సంపూర్ణ ఆనందానికి ప్రతిబంధకాలు. జీవితం-దాని యొక్క అవసరాలు సాధారణంగా, మనిషి జీవితంలో-కడుపునిండా ఆహారం, ఒంటినిండా బట్ట, నివాసానికి ఇళ్లు అంతే. ఇంకా కోరుకోవడానికి ఏవి సాధారణాలుగావు. స్వార్థం...
Comments
Post a Comment