Skip to main content

Posts

Showing posts with the label Physical life

Life-Naturalism

Life must be like a: naturalism, river flux, cool breeze, ocean water waves, sun's bright rays, sky's flowering. It should be ever primitive such as like: sensitive, existent , equivalent , oscillatory, characterized , constructive, unconditioned, individual, universal, romantic, lovable, flux of the fall, blooming of wild plant, blossoming of a flower, peaceful, painless, eternal, truthful, and non-violent. The preceding human values are treated as the  characteristics  of the eternal  Atman (Brahman).

భౌతిక సంపద-దాని శూన్యత్వం

శాశ్వతమైన దాని కొరకు మన శక్తిని   ఖర్చుచేయడం శ్రేయస్కరం . ఈ అశాశ్వతమైన వస్తు సంపద గురించి కష్టపడడం ఎంతవరకూ మంచిదికాదు . అన్నం , విద్య , బట్ట , ఇల్లు , మరియు కుటుంబం - వీటికన్నావిలువైన , మరియు అవసరమైనది మనిషికి ఒకటుంది ; అదే ధ్యాన్నం ( స్వాతంత్ర్య - స్వీయ - అన్వేషణా సాధనం ). నాకు తెలుసు నేనెంత లోటుకు   లోనయ్యానో ఇవన్ని ( పైవన్నీ ) కూడా లేనప్పుడు , మరియు అవన్నీ   వున్నా   సంతృప్తి కలగలేదు . కాని అదే ఆ   ధ్యాన్నమే నన్ను ఉన్నత లోకాలను చూడడానికి ప్రేరేపణ కలిగించి , మరియు వాటిని దర్శించే మహాత్భాగ్యాన్ని కలిగించింది . ఈ అదృష్టం అందరికీ దక్కుతుంది - వారి   ధ్యాన్నతీవ్రతను బట్టి - ఇది   ఆధారపడుతుంది . జీవితంలో మన   కోరికలే పెద్ద అడ్డంకులు ; ఇవే నిన్ను నీదగ్గర ఒక్క క్షణం ఉండనీయ్యవు , మరియు నిన్ను నీగురించి   ఆలోచించుకోనివ్వకుండా అడ్డుతగులుతాయి . చదువు , ఉద్యోగం ,  భార్య , పిల్లలు , గృహం , వాహనం , మరియు ఆస్తులు - సంపదలు - ఇవన్నీఅశాశ్వతాలు , కొన్ని రోజులే నీతో ఉండగలుగుతాయి , మరియు ...

జీవితం- దీని ప్రమేయం [భౌతికం+ఆత్మిక కర్మలు]

భౌతిక [శారీరక+మానసిక+బుద్ధిపర]మైన కర్మలు, మరియు ఆధ్యాత్మిక [బుద్ధిపర+హృదయ పూర్వక+ఆత్మిక] కర్మలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భౌతికం   స్థూలమైన కర్మల సమూహం; అదే ఆధ్యాత్మికం సూక్ష్మమైన కర్మల సమూహం. భౌతిక దృష్టితో సూక్ష్మ కర్మలు చేస్తాననడం  మూర్ఖం. అదే ఆద్యాత్మిక దృష్టితో స్థూల కర్మలసాధ్యం. ఎందుకంటే, భౌతికంలో చాలా నీచమైన (తక్కువైన) క్రియలు చేయవలసి వస్తుంది; దీనికి ఆధ్యాత్మికత సహకరించదు. ఇంకో కోణంలో, ఆధ్యాత్మికతలో భౌతికం ఎప్పటికీ ప్రవేశించలేదు. ఎందుకంటే, ఆధ్యాత్మికతమనే  స్వచ్చమైన  ఆస్థిత్వంలో, మురికి వాసనలకు చోటివ్వబడదు. అజ్ఞానులు (మూర్ఖులు) భౌతికంలో ఉంటూ అత్యంత విలువైన, మరియు గొప్ప పనులు చేస్తున్నామని భావిస్తారు; వారి నమ్మకం చాలా నీచమైనది.  ఏలనంటే, సహజంగా మనిషి ఆత్మస్వరూపుడు; దానిని మరిచి సహజత్వానికి విరుద్ధంగా పనులు చేస్తూ, ఆ కర్మలే తన కష్టాలు, మరియు లక్ష్యాలు, మరియు వాటి ఫలితాలు (విజయాలు) అని అనడం నిస్శంకోచంగా మూర్ఖమే.

నా పరిసరాలు-మనుషుల ప్రవర్తనలు

ప్రతీ సమాజపు పరిసర స్థలాలలో ,   నాలా నాలోనే దాస్తూ ఎవ్వరికీ చెప్పుకోలేని కొన్ని కథలు ఉంటాయని   అనుకుంటున్నాను . ఇది ఎంతవరకు నిజమో నాకు అనుభవం లేదు . కాని , ఒక్కమాట చెప్పగలను . ఇంతమంది మనస్సు అనే , ఒక తుచ్చ ( నీచ ) మైన పని మనిషిలా వుండే , పరికరాన్ని యజమానిని చేస్తూ ... బానిస బ్రతుకులు బతకడం అనేది ప్రస్తుత మనిషి యొక్క బలహీనత . ఇదే మనిషియొక్క నమ్మకంగా :   జీవితమంతా తప్పులు చేస్తూ , అవే తప్పుల్ని ఇతరులతో చేయిస్తూ , మరియు ఇతరులకు తనయొక్క బురద రాయాలని ప్రయత్నిస్తూ వస్తున్నాడు . అసలు, సహజంగా ప్రకృతిలో నిజమేమిటి ( సత్యమేమిటి )? ఒకరిని ఒకరు ప్రేమతో చూడలేని జీవితం   ఆనందమైనదా ? ఒకరికి ఇంకొకరు సహాయం చేయలేని నాడు , ఈ సమాజం: సుఖమైన   భోగాలలో   తూలుతున్నరోజు , మనస్సు పరాకాష్టకు చేరినరోజు ఈ యొక్క విశ్వశాంతి ఎక్కడ్నుంచి వస్తుంది ?   ప్రస్తుత ప్రతీ మనిషి :   తనను ఎం   చేస్తున్నాడో , ఎందుకు ఇవన్నీ ( పనులు ) చేయాలో , ఎలా ఒక జీవి ఆనందంగా ఉండగలదో నేర్చుకోవడానికి సాధన అవసరం ....

భౌతిక సమాజం-అవసరాలు

భౌతిక సమాజం-దాని మూలాలు  భౌతిక సమాజం మనస్సు యొక్క సంకల్పాలు, మరియు వాటియొక్క ఫలితాల వలన కొనసాగుతుంది; ఇదే లేకపోతే అందరూ శాంతంగా, సుఖంగా, మరియు ఆనందంగా బ్రతుకు సాగించేవారు.  అసలు నేనొక విషయం అడుగుతా ఎందుకు మనిషి సంకల్పించుకోవాలి, మరియు ఎందుకు ఆ ఫలితాలకు అనుగుణంగా (లేక) విరుద్ధంగా ప్రవర్తించాలి. ఇదంతా చూస్తుంటే మనస్సనే పరికరం ప్రతీ మనిషిని తనకు బానిసను చేసుకుని నిమిష, నిమిషానికి చిత్రహింసలు పెడుతూ; అసలు ఈ మనస్సు, మనిషి జీవితాన్నే అంధకారంలోకి తీసుకువెళ్ళి నరక ప్రాయంగా చేస్తుంది.  చివరగా, సమాజం-వాటియొక్క మూలాలను గురించి చెప్పుకుంటే అవి: రాజకీయం, వినోదం, మతం, భోగలాలసం, కర్మాగారసమూహం, క్రీడావినోదం, భౌతిక శాస్త్ర విద్య, ధన సంపాదన, విత్త విశ్లేషణ; ఇవన్నీ మనిషి యొక్క సంపూర్ణ ఆనందానికి ప్రతిబంధకాలు.  జీవితం-దాని యొక్క అవసరాలు  సాధారణంగా, మనిషి జీవితంలో-కడుపునిండా ఆహారం, ఒంటినిండా బట్ట, నివాసానికి ఇళ్లు అంతే. ఇంకా కోరుకోవడానికి ఏవి సాధారణాలుగావు.  స్వార్థం...

భౌతికం-ఆధ్యాత్మికం

సమస్య భౌతికంలో   ఎన్నో   అవరోధాలు   ఎదురవుతాయి .   అవన్నీ   నీ   యొక్క   మరుక్షణానికి   ఉపయోగపడగలిగే   క్షణాలుగా   మార్చుకోవాలి. ఇదంతా   నీ   చేతుల్లోనే   ఉంటుంది .   నిస్పృహ   చెందకు   మిత్రమా !   నీయొక్క   ఆత్మ   విశ్వాసాన్ని   కోల్పోతే   సర్వం   కోల్పోయినట్టేనని   అర్థం   చేసుకో ... అనంత   ధైర్యంతో ,   నిరంతర   శ్రమతో ,   కోటి   నిరీక్షనలతో   సిద్దంగా   ఉన్ననాడు ,   నీయొక్క   మోక్షద్వారం   తెరుచుకుంటుంది .   ఇది   ఒక్కసారి   తెరుచుకుంటే   తర్వాత   మళ్లీ   అగాథంలోకి   వెళ్ళడం   జరగదు .  ఇది   సత్యం !   ఈ   మోక్ష   జాగృత   దివ్యచక్షువు   నీతో   నీలో   నీవుగా   ( నిరంతరం )   వెలిగితూనే   ఉంటుంది .  సమాధానం   ప్రతీ   అహంకారపు   క్రియకి   కృతజ్ఞతయే   చల్లార్పు , ...