Skip to main content

Posts

Showing posts with the label Shareeram

మన రోజు వారి ఆహారం -ప్రయోజనం

  భౌతికంగా తీసుకునే ఆహారంలో శక్తి నిక్షిప్తమై వుంటుంది ; ఈ యొక్క శక్తి కొన్ని స్థాయిలలో ఉండబడుతుంది . వివిధ శక్తి   స్థాయుల గురించి చెప్పుకుంటే , అవి మూడు    రకాలు - స్థూల శక్తి , సూక్ష్మ శక్తి , మరియు విశ్వ శక్తి . స్థూల శక్తి శరీరం ద్వారా పొందబడితే , అటు స్థూల శక్తి మానసిక లేదా హృదయ   కర్మల ద్వారా పొందబడుతుంది , చివరగా విశ్వ శక్తి నీయొక్క హృదయ లేదా   ఆత్మ ద్వారా పొందబడుతుంది . అసలు శక్తి రెండు రకాలు ఒకటి ధన ( సవ్య ) శక్తి , రెండోది ఋణ ( అపసవ్య ) శక్తి అని చెప్పుకోవచ్చు . ఋణ   శక్తి మన శరీరం ద్వారా ఎక్కువగా తేబడుతుంది , ధన శక్తి మన ఆత్మ లేదా హృదయం   ద్వారా తేబడుతుంది , కాని రెండు విధాల   శక్తులూ మనస్సు    ద్వారా   తేబడతాయి .  కనుక , అత్యంత ఉన్నతమైన శక్తి కొరకు మన ఆత్మను ఆశ్రయించక తప్పదు . ఇక మిగతా రెండు శక్తి వాహకాలు మనకు సమాజం   పుట్టినప్పటి నుండి నడపబడుతూ ఉంటున్నాయి . ఇది సర్వ సాధారణం . ఆత్మను ఆశ్రయించడానికి ఏకైక మార్గం ధ్యాన్న...

బందుత్వం-అశాశ్వతం-నిరుపయోగం

ప్రతీ   ఒక్కరూ   తనకేమి   కలుగుతుందో   అని   ఆలోచిస్తూ , ఇతరులకి   ప్రతిఫలంగా   ఇవ్వగోరతారు   ఇప్పటి   మనిషి . అత్యుత్తమ   త్యాగం - ఇతరులకు   ఏమి ఆశింపకుండా ఇవ్వడమే   అని   అర్థం .  ఇది   ఇప్పటి   ప్రపంచంలో   నెలకొల్పబడటం ,  పాటించడం , మరియు   ఆచరించి   చెప్పడం   దుర్లభం .   మోహం   అనేది   ఇంకా   తనకు   ఏదో   కావాలి   అని   ప్రయత్నిస్తుండడం .  భౌతిక   సంపదంతా   కూడా    ఆశాశ్వతం - ఇది   ఎరింగిననాడు   మనిషి   మాధవుడవుతాడు . 

భౌతిక సంపద-దాని శూన్యత్వం

శాశ్వతమైన దాని కొరకు మన శక్తిని   ఖర్చుచేయడం శ్రేయస్కరం . ఈ అశాశ్వతమైన వస్తు సంపద గురించి కష్టపడడం ఎంతవరకూ మంచిదికాదు . అన్నం , విద్య , బట్ట , ఇల్లు , మరియు కుటుంబం - వీటికన్నావిలువైన , మరియు అవసరమైనది మనిషికి ఒకటుంది ; అదే ధ్యాన్నం ( స్వాతంత్ర్య - స్వీయ - అన్వేషణా సాధనం ). నాకు తెలుసు నేనెంత లోటుకు   లోనయ్యానో ఇవన్ని ( పైవన్నీ ) కూడా లేనప్పుడు , మరియు అవన్నీ   వున్నా   సంతృప్తి కలగలేదు . కాని అదే ఆ   ధ్యాన్నమే నన్ను ఉన్నత లోకాలను చూడడానికి ప్రేరేపణ కలిగించి , మరియు వాటిని దర్శించే మహాత్భాగ్యాన్ని కలిగించింది . ఈ అదృష్టం అందరికీ దక్కుతుంది - వారి   ధ్యాన్నతీవ్రతను బట్టి - ఇది   ఆధారపడుతుంది . జీవితంలో మన   కోరికలే పెద్ద అడ్డంకులు ; ఇవే నిన్ను నీదగ్గర ఒక్క క్షణం ఉండనీయ్యవు , మరియు నిన్ను నీగురించి   ఆలోచించుకోనివ్వకుండా అడ్డుతగులుతాయి . చదువు , ఉద్యోగం ,  భార్య , పిల్లలు , గృహం , వాహనం , మరియు ఆస్తులు - సంపదలు - ఇవన్నీఅశాశ్వతాలు , కొన్ని రోజులే నీతో ఉండగలుగుతాయి , మరియు ...

జీవితం- దీని ప్రమేయం [భౌతికం+ఆత్మిక కర్మలు]

భౌతిక [శారీరక+మానసిక+బుద్ధిపర]మైన కర్మలు, మరియు ఆధ్యాత్మిక [బుద్ధిపర+హృదయ పూర్వక+ఆత్మిక] కర్మలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భౌతికం   స్థూలమైన కర్మల సమూహం; అదే ఆధ్యాత్మికం సూక్ష్మమైన కర్మల సమూహం. భౌతిక దృష్టితో సూక్ష్మ కర్మలు చేస్తాననడం  మూర్ఖం. అదే ఆద్యాత్మిక దృష్టితో స్థూల కర్మలసాధ్యం. ఎందుకంటే, భౌతికంలో చాలా నీచమైన (తక్కువైన) క్రియలు చేయవలసి వస్తుంది; దీనికి ఆధ్యాత్మికత సహకరించదు. ఇంకో కోణంలో, ఆధ్యాత్మికతలో భౌతికం ఎప్పటికీ ప్రవేశించలేదు. ఎందుకంటే, ఆధ్యాత్మికతమనే  స్వచ్చమైన  ఆస్థిత్వంలో, మురికి వాసనలకు చోటివ్వబడదు. అజ్ఞానులు (మూర్ఖులు) భౌతికంలో ఉంటూ అత్యంత విలువైన, మరియు గొప్ప పనులు చేస్తున్నామని భావిస్తారు; వారి నమ్మకం చాలా నీచమైనది.  ఏలనంటే, సహజంగా మనిషి ఆత్మస్వరూపుడు; దానిని మరిచి సహజత్వానికి విరుద్ధంగా పనులు చేస్తూ, ఆ కర్మలే తన కష్టాలు, మరియు లక్ష్యాలు, మరియు వాటి ఫలితాలు (విజయాలు) అని అనడం నిస్శంకోచంగా మూర్ఖమే.

నా పరిసరాలు-మనుషుల ప్రవర్తనలు

ప్రతీ సమాజపు పరిసర స్థలాలలో ,   నాలా నాలోనే దాస్తూ ఎవ్వరికీ చెప్పుకోలేని కొన్ని కథలు ఉంటాయని   అనుకుంటున్నాను . ఇది ఎంతవరకు నిజమో నాకు అనుభవం లేదు . కాని , ఒక్కమాట చెప్పగలను . ఇంతమంది మనస్సు అనే , ఒక తుచ్చ ( నీచ ) మైన పని మనిషిలా వుండే , పరికరాన్ని యజమానిని చేస్తూ ... బానిస బ్రతుకులు బతకడం అనేది ప్రస్తుత మనిషి యొక్క బలహీనత . ఇదే మనిషియొక్క నమ్మకంగా :   జీవితమంతా తప్పులు చేస్తూ , అవే తప్పుల్ని ఇతరులతో చేయిస్తూ , మరియు ఇతరులకు తనయొక్క బురద రాయాలని ప్రయత్నిస్తూ వస్తున్నాడు . అసలు, సహజంగా ప్రకృతిలో నిజమేమిటి ( సత్యమేమిటి )? ఒకరిని ఒకరు ప్రేమతో చూడలేని జీవితం   ఆనందమైనదా ? ఒకరికి ఇంకొకరు సహాయం చేయలేని నాడు , ఈ సమాజం: సుఖమైన   భోగాలలో   తూలుతున్నరోజు , మనస్సు పరాకాష్టకు చేరినరోజు ఈ యొక్క విశ్వశాంతి ఎక్కడ్నుంచి వస్తుంది ?   ప్రస్తుత ప్రతీ మనిషి :   తనను ఎం   చేస్తున్నాడో , ఎందుకు ఇవన్నీ ( పనులు ) చేయాలో , ఎలా ఒక జీవి ఆనందంగా ఉండగలదో నేర్చుకోవడానికి సాధన అవసరం ....

ధ్యాన్నం-జీవిత సమస్యా పరిష్కారం

ధ్యాన్నం   అసలు అంతరంగంలో ఏమీ ఉండకుండా , మన మనస్సు , మరియు   బుద్ధి ఏమీ చేయకుండా ; ఆలోచనలు ఆగిపోయినపుడు   అంతరంగపు అట్టడుగున కూడా ఎలాంటి కదలికలు లేకుండా శాంతంగా కర్మ నివృత్తి , దృష్టి కార్యం చేస్తూ ఉండడమే ధ్యాన్నం . మనస్సు - జీవితపుతడ్డంకి మనస్సు అల్పమైనది, మరియు అది ఒక అస్తిత్వాన్ని నిమిత్త మాత్రంగా, కొన్ని నిమిషాలసేపు ఆపగలదు . ఇలా ఈ మనస్సు మన జీవితం అంతా వృధా చేయడానికి ప్రయత్నిస్తుంది .  ఎపుడైతే అస్తిత్వం పరమాత్మతో కలిసినపుడు: అనంత , పరవశ , మరియు   శాంత ఆత్మానందం కలుగుతుంది ;  ఈ ప్రయత్నానికి భగవంతుడి సహకారం ఎల్లప్పుడూ వుంటుంది . ఇచ్ఛా త్యాగం - స్వాతంత్ర్యత సమాజంలో ప్రతీది నిన్ను తన దగ్గరకు తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించవు . నీవే నీ మీద ఆధిపత్యం లేక బానిసగా మారతావు ఇది సత్యం . శూన్య స్థితి - భైరవ స్థితి   ఎదుట మాటలాడేటప్పుడు , శూన్యంలోనికి ప్రయాణించడం ఒక క్రియ , అదే భైరవ స్థితి .  ప్రతిక్షణం , కనీసం ఒంటరిగా ఉన్నపుడైన శూన్యంలోకి వెళ్ళడం శ్రేయస్కరం ....