Skip to main content

Posts

Showing posts with the label Inner Journey

Blossoming the self...

Blossoming the self... ______________________________________________________ Our very core of the inner awakens when you become pure and sensitive... then consequently flowering happens in you and it blossoms ...then  ever ecstasy continues until your death (death means that the state at which you (self soul) died but your mind awakens and continues...)...this is so called ENLIGHTENMENT... So what is important is not at all be important, but what is not important is so important in this society and in your present state of mind... Beauty comes from the inner blossoming, but it is impossible to comes the beauty from the outer knowledge. The way your living is your attitude-the way your travelling is your life The knowing one thing becomes a knowledge-the  experimenting one thing with an activity becomes the source to your intellectual   

నీ జీవితం ఒక స్వాతంత్ర్య ప్రయాణం

స్వాతంత్ర్య ప్రయాణం  నీ జీవితంలో ప్రతీ క్షణం నీ యొక్క, నీకివ్వబడిన అస్తిత్వ సమూహం. ఈ ప్రస్తుత క్షణాలు పూర్తిగా నీ చేతుల్లోనే వున్నాయి.  నీ జీవిత ప్రయాణoలో జరిగే ప్రతీ క్రియకి నీయొక్క కర్మయే కారణం. నీ కర్మని లేదా నీ కర్మకి నీవే బాధ్యుడవు. ఇచ్చా త్యాగం వలన మనస్సు శూన్యమౌతుంది. దాని పరిణామమే నీ యొక్క కర్మాస్వాతంత్ర్యం.ఈ యొక్క స్వాతంత్ర్యమే నీయొక్క ఆత్మవికాసానికి, ఆత్మ పునర్వికాసానికి, ఆత్మ శక్తి పునర్నిర్మాణానికి , ఆత్మత్యాగ ఫలితమే ఆత్మ జ్ఞానమునకు మరియు ఆత్మ నిగ్రహానికి ప్రతీకలు. జీవన ప్రయాణం జీవన ప్రయాణంలో ఇతరులతో నీకు సంపర్కం అవసరమని నేను చెప్పలేను. ఇతరుల మాటల ప్రభావాన్ని పూర్తిగా విస్మరించాలి. అవసరమనుకుంటే మాట్లాడాలి , లేదా పూర్తి నిశబ్దాన్ని పాటించాలి. ఈ మౌనమే నీ యొక్క అంతరాత్మ శుద్ధికి దోహదం చేస్తుంది. మిగతావన్నీ ఆటరిక క్రియలు, హాస్య ప్రక్రియలు. అస్తిత్వం -విలువ  "విలువైన వజ్రరత్నం లభించగానే గులకరాళ్ళతో ఆడుకోవడం తప్ప ఏమి చేస్తావు." అంతఃస్థితి అనే బంగరు అస్తిత్వ రుచి చూసినపుడు మిగతా భౌతిక-మానసిక అవస్తలు పూర్తిగా క్రీడా ప్రక్రియలు అనేది సత్యం! ఇదే వ...

సంయమం-సమాజపురీతి

సమాజపు   రీతి :   సున్నితమైన ,  నిష్కల్మషమైన మనస్సులు - హృదయాలు - కలిగి   ఉన్న మనుషులు ఈ   కర్కశమైన సమాజంలో బ్రతకాలనుకోవడం   తులసిమొక్కను   గంజాయి   వనంలో   నాట ప్రయత్నించినట్లౌతుంది . ఈ ప్రయత్నం   చాలా     క్లిష్టతరమైన దారులను   కలిగి   వుంటుంది ;  ఎంతో   కష్టతరమైన మార్గమిది . అందుకే   సమాజానికి   దూరంగా   హిమాలయాలలో   వున్నా . మరి దగ్గరగా సమాజంలో ఒక నియంత స్థానాన్ని అదిరోహించినా , రెండూ రేపటి యొక్క సమస్యావధులు కావు . సమస్యావధి ఒకే ఒక్కటి, అదే "అన్నింటిలో ఉంటూ దేనినీ అంటనివాడు యోగి"[భగవద్గీత:2]; ఈ చేయ ప్రయత్నించడమే 'యోగం'. ఇలా మన సమాజాన్ని ప్రేమిస్తూ, సేవిస్తూ మన ధర్మం మనం నిర్వర్తిన్చినపుడు ఇక ఎవ్వరూ నీకు అడ్డు తగలరు. సంయమం: యోగ క్రియ చేయడం ఎలా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో మెసలే సందేహం. దీనికి ఒక మార్గముంది, కానీ సమాధాన మధనం మీరే చేసుకోవాలి సుమా! అయితే ధ్యాన్నం [అంతః ప్రయ...

అంతః నేత్రం-మనోక్రియలు

అంతఃనేత్రం తీవ్ర ధ్యాన్న సాధనలోనే మేల్కొంటుంది ; ఇది ఒక రకంగా చెప్పాలంటే : శరీరమనే   దీపెంతం , వత్తి అనే నాడీమండలం , మరియు నూనె అనే ఓజఃశక్తి ద్వారా ఈ దీపాన్ని వెలిగించినపుడు అది నిరంతరం   వెలుగును ( జ్ఞానాన్ని ), వెచ్చదనాన్ని ( ప్రేమను )   అందిస్తుంది . ఒకసారి అజ్ఞానమనే చీకటి యుగం మనలో   ప్రవేశించిందంటే జ్ఞానజ్యోతిని వెలిగించడం కష్టతరం ; ఎందుకంటే ఆ నాడీమండల శుద్ధి , ఆ దీపెంతపు శుద్ధి , మరియు మన   దీపాన్ని వెలిగించే దీపం కూడా శుద్ధంగా వుండాలి .  ఆలోచనలనే   సుడిగాలులకు జనికి ఈ జ్యోతిని ఆర్పివేసుకున్నవాడు: డాంభికుడు , అహంకారి , పిరికి పంద , మరియు అవివేకి ; వీడు ఒక నిప్పుకోడి లాంటివాడు . ఒకసారి ఈ     జ్యోతి ఆరిందని అంగీకరిస్తే , దాని నుండి దట్టమైన   పొగలు రావడం ప్రారంభిస్తాయి . ఇవే ఈ పొగలే ఆలోచనా పరంపరలు ; ఇవే ఆలోచనా పరిణామ ఫలితాలు - క్రియలు ( భౌతిక కర్మలు ). జాగరూకతతో , ఎరుకతో , మరియు జ్ఞానజ్యోతి సమక్షంలో ( మనస్సు యొక్క )  ప్రతీ ఆలోచనలను , వాటి క్రియ...

మనిషి-తనలో దాగిన శక్తి

మనిషిలో దాగి ఉన్నశక్తి ఎంతో అమోఘం ; ఇది   సుర్యునికన్నా వెయ్యి రెట్ల జ్ఞాన వెలుగులను  ఇ స్తుంది ; అందుకే నిన్ను నీవు   తక్కువ అంచనా వే సుకోకూడదు , నీలో చాలా శక్తి దాగుంది ;  దానిని వెలికితీయడమొక్కటే నీయొక్క ప్రస్తుత , మరియు ప్రథమ కర్తవ్యం .   లే ! లేచి నిలబడు మిత్రమా , అన్ని క్రియలను గమనించు దేనిలో ప్రవర్తించకు ; అప్పుడే , నీ నిజస్వభావ ఉనికి జీవంతో ఉంటుంది , ఇది సత్యం !

నిశబ్దం-అంతఃప్రయాణం

నిశబ్దం-అంతఃప్రయాణం ---------------------------------------------------------------------------------------------------------------------------------- ------------------------------------------------------------------------------------------------------------ నిశబ్దం అంతరంగము యొక్క మొదటి స్థితి. దీని నుండి శాంతి, మౌనం, మరియు సంపూర్ణ జాగరూకత లభిస్తుంది. జాగరుకతతో  వుండే స్థితిని ఎరుక స్థితి అంటారు. ఏరువాక సహజ స్థితిలాగే ఎరుక స్థితి నిత్యం నూతనం, వినూతనం, జ్ఞాన ప్రవాహం, అంతరంగ శుద్ధం, బద్ధక నిర్మూలనం, కర్మ భుజస్కంధం, మరియు ఇదే ఆత్మ శక్తికి ప్రతిరూపం.   ఆత్మకి  నిశబ్ద మే ఇంధనం. మనం ఎంత మౌనంగా వుంటే అంత ఇంధన పొదుపు (సద్వినియోగం) అవుతుంది. మన  జీవితంలో అంతః ప్రయాణం యొక్క దారులు చాలా ఒడిదుడుకులు కలిగి వుంటాయి. ఎందుకంటే మనస్సు యొక్క మర్మం చాలా నిగూడం, ఇది ఎవ్వరికీ చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి అని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతీ నిమిషం విలువైనది. దానిని అనుభూత మొనర్చుకో మిత్రమా! --------------------------------------------------------------------...