నిశబ్దం-అంతఃప్రయాణం
----------------------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------
నిశబ్దం అంతరంగము యొక్క మొదటి స్థితి. దీని నుండి శాంతి, మౌనం, మరియు సంపూర్ణ జాగరూకత లభిస్తుంది. జాగరుకతతో వుండే స్థితిని ఎరుక స్థితి అంటారు. ఏరువాక సహజ స్థితిలాగే ఎరుక స్థితి నిత్యం నూతనం, వినూతనం, జ్ఞాన ప్రవాహం, అంతరంగ శుద్ధం, బద్ధక నిర్మూలనం, కర్మ భుజస్కంధం, మరియు ఇదే ఆత్మ శక్తికి ప్రతిరూపం.
ఆత్మకి
నిశబ్డమే ఇంధనం. మనం ఎంత మౌనంగా వుంటే అంత ఇంధన పొదుపు (సద్వినియోగం) అవుతుంది.
మన జీవితంలో
అంతః ప్రయాణం యొక్క దారులు చాలా ఒడిదుడుకులు కలిగి వుంటాయి. ఎందుకంటే మనస్సు యొక్క
మర్మం చాలా నిగూడం, ఇది ఎవ్వరికీ చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి అని చెప్పవచ్చు. ఈ
ప్రయాణంలో ప్రతీ నిమిషం విలువైనది. దానిని అనుభూత మొనర్చుకో మిత్రమా!
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Comments
Post a Comment