నా ధ్యాన అనుభవాల వాళ్ళ పొందిన ఫలాలు:
ధ్యాన్నం మనిషిని, తన సనాతన జీవిత పరంపరలో నేర్చుకున్నమరియు అనుభూతిపొందిన జ్ఞ్యానాన్ని వెలికి తీస్తుంది . ఈ ప్రయత్నా సాధనమే మనిషిని పరమాత్మ అస్తిత్వానికి చేరుకునే అవకాశాన్ని ఇస్తుంది. మరి ప్రతీ మనిషి, ఈ ప్రస్తుత పరిస్త్తితుల్లో, ఇలాంటి మానసిక దృక్పథంతో వుండటం కొంచెం సందేహించదగ్గ విషయం. ఎందుకంటే మారుతున్న నేటి సమాజపు విలువలకు దగ్గట్టుగా ప్రతీ మనిషి ప్రవర్తించడం సహజం. కాని సహజత్వం అంటే అర్థం, ప్రకృతికి తగ్గట్టుగా నడుచుకోవడం, దానికి అతీతంగా మెలగడం కాదు.
౧.భౌతికం-ఆధ్యాత్మికం:
ఇక్కడ చెప్పిన రెండు విరుద్దమైన విషయాలను అర్థం చేసుకోవాలి అవి: ఒకటి భౌతికం, ప్రపంచపు పోకడలకు తగినట్టుగా ప్రతిక్షణం ఇతరుల పట్ల భయంతో, అసూయతో, అసత్యపూర్వక గౌరవంతో, అహంకారంతో, మరియు వీటన్నిటి ఫలితంగా పొందే దుఖ్ఖంతో బ్రతుకు సాగించడం; రెండవది ఆధ్యాత్మికం (ప్రస్తుత జీవనం) , ప్రతిక్షణం తన మీద ఎరుకతో, శాంతంతో, మరియు ధర్మం (చేయదగిన వాటి)లో ఉంటూ, ఇతరుల మీద ప్రేమతో, నిస్వార్థతతో, మరియు వీటివాళ్ళ లభించిన సేవాభావంతో బ్రతకడం అని అర్థం.
౨.నమ్మక వ్యవస్థ:
జాగృతమైన మనస్సు భౌతిక క్రియలను అంతరంలోనికి అనుమతి చెందించి మళ్లీ
బాహ్య మనస్సుకి అందిస్తుంది. దీని పరిణామమే మనలో జరిగే సమాచార శక్తి అంతర ప్రసరణకు
మూలం, ఇదే చితవృత్తి అని చెప్పుకోవచ్చు. జీవితంలో సహజంగా బ్రతకడమే అసలైన యోగ క్రియ
అని నా ఉదేశ్యం. ఇది అందరికీ వర్తిస్తుంది, చాలా సులువైనది, సరళమైనది.
౩.త్యాగం:
త్యాగమనేది ప్రేమకి మొదటి పునాది రాయి. ప్రేమ, సంపూర్ణ త్యాగం వలననే పుడుతుంది. సంపూర్ణ త్యాగం వలన,
సంపూర్ణ ప్రేమ పుడుతుంది. కానీ, సంపూర్ణ స్వార్ధం వలన సంపూర్ణ నిరాశ పుడుతుంది. ప్రేమ పేరుతో అనురాగం
వృద్ది చేసుకుంటే అది ఎన్నటికీ సంపూర్ణ త్యాగానికి సిద్దపడదు! స్వార్ధం, అనురాగం రెండు కూడా జీడిగింజ,
జీడిఫలం లాంటివని అర్థం.
సంపూర్ణ ప్రేమ పుడుతుంది. కానీ, సంపూర్ణ స్వార్ధం వలన సంపూర్ణ నిరాశ పుడుతుంది. ప్రేమ పేరుతో అనురాగం
వృద్ది చేసుకుంటే అది ఎన్నటికీ సంపూర్ణ త్యాగానికి సిద్దపడదు! స్వార్ధం, అనురాగం రెండు కూడా జీడిగింజ,
జీడిఫలం లాంటివని అర్థం.
౪.దుఃఖం:
దుఃఖ కారణం సుఖాలను కోరుకోవడమే జీడిపండు కావాలంటే దానిని
అంటిపెట్టుకుని ఉన్న (ఫలాన్ని)-జీడిపిక్కని రెండింటిని వేరుచేయాలి. దాని వలన
అనర్థాలు జరుగుతాయి, జరగనీ! నీ కర్మకు నీవే భాద్యుడవు. ధ్యాన్నం వలన సుఖ దుఃఖాలకు
అతీతంగా బ్రతకవచ్చు. అది కేవలం నీవు పూర్తి ఎరుకలో, జాగృతి సమయంలోనే సాధ్యం.
సారాoశం: వీటన్నింటి యొక్క సారం, ఒకే ఒక్కటి ప్రతీ ఒక్కరు ధ్యాన్నం
నేర్చుకోవాలి, ధ్యాన్నం అభ్యాసం చేయాలి, మరియు నేర్చుకున్నది ఇతరులకు
నేర్పాలి. ఇదే మన అందరి దగ్గర కోరుకుంటూ..............
చక్కని మానవతా సుగుణాల పరిమళాలు నా నాసికాపుటాల్ని తాకి ఆనందపులకిత తరంగితాంతరంగుని చేస్తున్నవి. అభ్యుదయోఽస్తు! మీ బ్లాగు బాగున్నది. అభినందనలు!
ReplyDelete