సమాజపు రీతి: సున్నితమైన, నిష్కల్మషమైన మనస్సులు-హృదయాలు-కలిగి ఉన్న మనుషులు ఈ కర్కశమైన సమాజంలో బ్రతకాలనుకోవడం తులసిమొక్కను గంజాయి వనంలో నాట ప్రయత్నించినట్లౌతుంది. ఈ ప్రయత్నం చాలా క్లిష్టతరమైన దారులను కలిగి వుంటుంది; ఎంతో కష్టతరమైన మార్గమిది. అందుకే సమాజానికి దూరంగా హిమాలయాలలో వున్నా. మరి దగ్గరగా సమాజంలో ఒక నియంత స్థానాన్ని అదిరోహించినా, రెండూ రేపటి యొక్క సమస్యావధులు కావు.
సమస్యావధి ఒకే ఒక్కటి, అదే "అన్నింటిలో ఉంటూ దేనినీ అంటనివాడు యోగి"[భగవద్గీత:2];
ఈ చేయ ప్రయత్నించడమే 'యోగం'. ఇలా మన సమాజాన్ని ప్రేమిస్తూ, సేవిస్తూ మన ధర్మం
మనం నిర్వర్తిన్చినపుడు ఇక ఎవ్వరూ నీకు అడ్డు తగలరు.
సంయమం:
యోగ క్రియ చేయడం
ఎలా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో మెసలే సందేహం. దీనికి ఒక మార్గముంది,
కానీ సమాధాన మధనం మీరే చేసుకోవాలి సుమా! అయితే ధ్యాన్నం
[అంతః ప్రయాణ ప్రయత్న సాధన] చేస్తూ [నిరంతర ప్రయత్న
ఫలితంను అనుభూతి చెందుతూ; ఇలా ఇంకోదిక్కు, దాని యొక్క
పుష్ప ఫలములను మన సమీప సాధకులకు (లేక) సమీప ప్రజలకు అందిస్తూ ముందుకు
సాగిపో మిత్రమా...
Comments
Post a Comment