సమాజమ్మునెదిరింపగ సంకెళ్లను తెంపవా?
సత్యాగ్రహ స్థాపనకు సమ్మతింపవా?
స్థాపించెనజ్ఞానము దురమతాంధకారమునే
సాధించుమునోజ్ఞాని సామరస్య శాంతినే
వెలుగెత్తినెగసు కెరటం వెన్నెలయే మిన్నుయై
వెలుగుచుండునీ దీపం వీధిలోన ఒంటరియై
సంస్థాగత చెరలోన సన్నగిల్లె సత్సంగం
స్వయంసాధనాయుధమే సంధించునే బంధం
స్వాతంత్ర్యతయే నీకు సత్యస్వరూపం
స్వానుభవమే దీనికి కొలమానం
వెదుకుమా వెన్నెల వెలుగులనే నేస్తమా!
వెలవెల బోవుటాపి వెయ్యిమార్లు చూడుమా!
సంచరించునజ్ఞానము సంగతులే తెలియక
సత్యసాధనలో వారు ప్రయత్నంబె సలుపక
Comments
Post a Comment