స్వాతంత్ర్య ప్రయాణం
నీ జీవితంలో ప్రతీ క్షణం నీ యొక్క, నీకివ్వబడిన అస్తిత్వ సమూహం. ఈ ప్రస్తుత క్షణాలు పూర్తిగా నీ చేతుల్లోనే వున్నాయి. నీ జీవిత ప్రయాణoలో జరిగే ప్రతీ క్రియకి నీయొక్క కర్మయే కారణం. నీ కర్మని లేదా నీ కర్మకి నీవే బాధ్యుడవు. ఇచ్చా త్యాగం వలన మనస్సు శూన్యమౌతుంది. దాని పరిణామమే నీ యొక్క కర్మాస్వాతంత్ర్యం.ఈ యొక్క స్వాతంత్ర్యమే నీయొక్క ఆత్మవికాసానికి, ఆత్మ పునర్వికాసానికి, ఆత్మ శక్తి పునర్నిర్మాణానికి , ఆత్మత్యాగ ఫలితమే ఆత్మ జ్ఞానమునకు మరియు ఆత్మ నిగ్రహానికి ప్రతీకలు.
జీవన ప్రయాణం
జీవన ప్రయాణంలో ఇతరులతో నీకు సంపర్కం అవసరమని నేను చెప్పలేను. ఇతరుల మాటల ప్రభావాన్ని పూర్తిగా విస్మరించాలి. అవసరమనుకుంటే మాట్లాడాలి , లేదా పూర్తి నిశబ్దాన్ని పాటించాలి. ఈ మౌనమే నీ యొక్క అంతరాత్మ శుద్ధికి దోహదం చేస్తుంది. మిగతావన్నీ ఆటరిక క్రియలు, హాస్య ప్రక్రియలు.
అస్తిత్వం -విలువ
"విలువైన వజ్రరత్నం లభించగానే గులకరాళ్ళతో ఆడుకోవడం తప్ప ఏమి చేస్తావు."
అంతఃస్థితి అనే బంగరు అస్తిత్వ రుచి చూసినపుడు మిగతా భౌతిక-మానసిక అవస్తలు పూర్తిగా క్రీడా ప్రక్రియలు అనేది సత్యం! ఇదే వాడకం.
Comments
Post a Comment