అంతఃనేత్రం తీవ్ర ధ్యాన్న సాధనలోనే మేల్కొంటుంది; ఇది ఒక రకంగా చెప్పాలంటే: శరీరమనే దీపెంతం, వత్తి అనే నాడీమండలం, మరియు నూనె అనే ఓజఃశక్తి ద్వారా ఈ దీపాన్ని వెలిగించినపుడు అది నిరంతరం వెలుగును (జ్ఞానాన్ని), వెచ్చదనాన్ని (ప్రేమను) అందిస్తుంది.
ఒకసారి అజ్ఞానమనే చీకటి యుగం మనలో ప్రవేశించిందంటే జ్ఞానజ్యోతిని వెలిగించడం కష్టతరం; ఎందుకంటే ఆ నాడీమండల శుద్ధి, ఆ దీపెంతపు శుద్ధి, మరియు మన దీపాన్ని వెలిగించే దీపం కూడా శుద్ధంగా వుండాలి.
ఆలోచనలనే సుడిగాలులకు జనికి ఈ జ్యోతిని ఆర్పివేసుకున్నవాడు: డాంభికుడు, అహంకారి, పిరికి పంద, మరియు అవివేకి; వీడు ఒక నిప్పుకోడి లాంటివాడు. ఒకసారి ఈ జ్యోతి ఆరిందని అంగీకరిస్తే, దాని నుండి దట్టమైన పొగలు రావడం ప్రారంభిస్తాయి. ఇవే ఈ పొగలే ఆలోచనా పరంపరలు; ఇవే ఆలోచనా పరిణామ ఫలితాలు-క్రియలు (భౌతిక కర్మలు).
జాగరూకతతో, ఎరుకతో, మరియు జ్ఞానజ్యోతి సమక్షంలో (మనస్సు యొక్క) ప్రతీ ఆలోచనలను, వాటి క్రియలను గమనించితే చాలు; అవే నీయొక్క అనుభవాలుగా, అందెలుగా మారతాయి నిన్ను నీవు అనుభూతి చెందింప చేసుకోవడానికి!
Comments
Post a Comment