ప్రతీ సమాజపు పరిసర స్థలాలలో, నాలా నాలోనే దాస్తూ ఎవ్వరికీ చెప్పుకోలేని కొన్ని కథలు ఉంటాయని అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు అనుభవం లేదు. కాని, ఒక్కమాట చెప్పగలను. ఇంతమంది మనస్సు అనే, ఒక తుచ్చ(నీచ) మైన పని మనిషిలా వుండే, పరికరాన్ని యజమానిని చేస్తూ...బానిస బ్రతుకులు బతకడం అనేది ప్రస్తుత మనిషి యొక్క బలహీనత. ఇదే మనిషియొక్క నమ్మకంగా: జీవితమంతా తప్పులు చేస్తూ, అవే తప్పుల్ని ఇతరులతో చేయిస్తూ, మరియు ఇతరులకు తనయొక్క బురద రాయాలని ప్రయత్నిస్తూ వస్తున్నాడు.
అసలు, సహజంగా ప్రకృతిలో నిజమేమిటి (సత్యమేమిటి)? ఒకరిని ఒకరు ప్రేమతో చూడలేని జీవితం ఆనందమైనదా? ఒకరికి ఇంకొకరు సహాయం చేయలేని నాడు, ఈ సమాజం: సుఖమైన భోగాలలో తూలుతున్నరోజు, మనస్సు పరాకాష్టకు చేరినరోజు ఈ యొక్క విశ్వశాంతి ఎక్కడ్నుంచి వస్తుంది?
ప్రస్తుత ప్రతీ మనిషి: తనను ఎం చేస్తున్నాడో, ఎందుకు ఇవన్నీ(పనులు) చేయాలో, ఎలా ఒక జీవి ఆనందంగా ఉండగలదో నేర్చుకోవడానికి సాధన అవసరం. లేదంటే ఈ జన్మలోనే కాదు ప్రతీజన్మలో తన యొక్క జీవన పరంపరలో ఇక ఎప్పటికీ, ప్రయత్నించకపోతే, ప్రేతాత్మలుగా మిగిలి మనో బలహీనతలే ఇంధనంగా విశ్వయాత్ర చేయాల్సిందే!
లే! మిత్రమా, జాగృతమవ్వు!, ప్రతీక్షణం విలువైనదని తెలుసుకో: సహజంగా, శాంతంగా, నిశబ్దంగా, ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో, సంయమంతో జీవన ప్రయాణం సాగించినప్పుడు అసలు ఏ సమస్యలు రావు.
ఇది: సత్యం, నిర్ధారణం, మరియు నా యొక్క అనుభవం.
Comments
Post a Comment