భౌతిక
[శారీరక+మానసిక+బుద్ధిపర]మైన
కర్మలు, మరియు ఆధ్యాత్మిక [బుద్ధిపర+హృదయ పూర్వక+ఆత్మిక] కర్మలు మన జీవితాన్ని
ప్రభావితం చేస్తాయి.
భౌతికం స్థూలమైన కర్మల సమూహం; అదే ఆధ్యాత్మికం సూక్ష్మమైన కర్మల సమూహం. భౌతిక
దృష్టితో సూక్ష్మ కర్మలు చేస్తాననడం మూర్ఖం. అదే ఆద్యాత్మిక దృష్టితో స్థూల కర్మలసాధ్యం.
ఎందుకంటే, భౌతికంలో చాలా నీచమైన (తక్కువైన) క్రియలు చేయవలసి వస్తుంది; దీనికి
ఆధ్యాత్మికత సహకరించదు. ఇంకో కోణంలో, ఆధ్యాత్మికతలో భౌతికం ఎప్పటికీ
ప్రవేశించలేదు. ఎందుకంటే, ఆధ్యాత్మికతమనే స్వచ్చమైన ఆస్థిత్వంలో,
మురికి వాసనలకు చోటివ్వబడదు.
అజ్ఞానులు (మూర్ఖులు) భౌతికంలో ఉంటూ అత్యంత విలువైన, మరియు గొప్ప
పనులు చేస్తున్నామని భావిస్తారు; వారి నమ్మకం చాలా నీచమైనది. ఏలనంటే, సహజంగా
మనిషి ఆత్మస్వరూపుడు; దానిని మరిచి సహజత్వానికి విరుద్ధంగా పనులు చేస్తూ, ఆ కర్మలే తన
కష్టాలు, మరియు లక్ష్యాలు, మరియు వాటి ఫలితాలు (విజయాలు) అని అనడం నిస్శంకోచంగా
మూర్ఖమే.
Comments
Post a Comment