భౌతిక
సమాజం-దాని మూలాలు
- భౌతిక
సమాజం మనస్సు యొక్క సంకల్పాలు, మరియు వాటియొక్క ఫలితాల వలన
కొనసాగుతుంది; ఇదే లేకపోతే అందరూ శాంతంగా, సుఖంగా, మరియు ఆనందంగా బ్రతుకు
సాగించేవారు.
- అసలు
నేనొక విషయం అడుగుతా ఎందుకు మనిషి సంకల్పించుకోవాలి, మరియు ఎందుకు ఆ ఫలితాలకు
అనుగుణంగా (లేక) విరుద్ధంగా ప్రవర్తించాలి. ఇదంతా చూస్తుంటే మనస్సనే పరికరం
ప్రతీ మనిషిని తనకు బానిసను చేసుకుని నిమిష, నిమిషానికి చిత్రహింసలు పెడుతూ;
అసలు ఈ మనస్సు, మనిషి జీవితాన్నే అంధకారంలోకి తీసుకువెళ్ళి నరక ప్రాయంగా
చేస్తుంది.
- చివరగా,
సమాజం-వాటియొక్క మూలాలను గురించి చెప్పుకుంటే అవి: రాజకీయం, వినోదం,
మతం, భోగలాలసం, కర్మాగారసమూహం, క్రీడావినోదం, భౌతిక శాస్త్ర విద్య, ధన
సంపాదన, విత్త విశ్లేషణ; ఇవన్నీ మనిషి యొక్క సంపూర్ణ ఆనందానికి ప్రతిబంధకాలు.
జీవితం-దాని
యొక్క అవసరాలు
- సాధారణంగా,
మనిషి జీవితంలో-కడుపునిండా ఆహారం, ఒంటినిండా బట్ట, నివాసానికి ఇళ్లు అంతే.
ఇంకా కోరుకోవడానికి ఏవి సాధారణాలుగావు.
- స్వార్థం
వలన అసహజ జీవితం అలవడుతుంది. ధనికులలోఈ స్వార్థం ఎక్కువ వుంటుంది;
దీనికి లోభమే మూలం. అదే బీదవాడు, సాధారణంగా బ్రతుకుతాడు; ఆ బ్రతుకే తనను తన
యొక్క అస్తిత్వం దగ్గర శాశ్వతంగా జీవింపజేస్తుంది.
Comments
Post a Comment