శాశ్వతమైన దాని కొరకు మన శక్తిని ఖర్చుచేయడం శ్రేయస్కరం. ఈ అశాశ్వతమైన వస్తు సంపద గురించి కష్టపడడం ఎంతవరకూ మంచిదికాదు. అన్నం, విద్య, బట్ట, ఇల్లు, మరియు కుటుంబం-వీటికన్నావిలువైన, మరియు అవసరమైనది మనిషికి ఒకటుంది; అదే ధ్యాన్నం (స్వాతంత్ర్య-స్వీయ-అన్వేషణా సాధనం).
నాకు తెలుసు నేనెంత లోటుకు లోనయ్యానో ఇవన్ని (పైవన్నీ) కూడా లేనప్పుడు, మరియు అవన్నీ వున్నా సంతృప్తి కలగలేదు. కాని అదే ఆ ధ్యాన్నమే నన్ను ఉన్నత లోకాలను చూడడానికి ప్రేరేపణ కలిగించి, మరియు వాటిని దర్శించే మహాత్భాగ్యాన్ని కలిగించింది. ఈ అదృష్టం అందరికీ దక్కుతుంది-వారి ధ్యాన్నతీవ్రతను బట్టి- ఇది ఆధారపడుతుంది.
జీవితంలో మన కోరికలే పెద్ద అడ్డంకులు; ఇవే నిన్ను నీదగ్గర ఒక్క క్షణం ఉండనీయ్యవు, మరియు నిన్ను నీగురించి ఆలోచించుకోనివ్వకుండా అడ్డుతగులుతాయి. చదువు, ఉద్యోగం, భార్య, పిల్లలు, గృహం, వాహనం, మరియు ఆస్తులు-సంపదలు-ఇవన్నీఅశాశ్వతాలు, కొన్ని రోజులే నీతో ఉండగలుగుతాయి, మరియు జీవితంలో మొదటి అడ్డంకులివే మిత్రమా! ఇవి నిన్ను ఎప్పటికీ నీ దగ్గరికి చేరుకోలేనివ్వని, మరియు చేరగోరని వాహకాలుగా ప్రవర్తిస్తుంటాయి.
మనకు ఏ పదార్థం అవసరం లేదు; అది ఏదైనా మన ఫరిదిలో, మన అస్తిత్వంలో వున్నప్పుడు. జీవితం అనుభవించేది; పదాలలో చెప్పలేనిది మరియు వివరించలేనిదీ. ఇదే అసలు జీవనమంటే!
Comments
Post a Comment