సృజనాత్మకత
===============================
సృజనాత్మకత లేకనా నాలో ఈ సంఘర్షణలు
సంపాదన ముఖ్యమనా ఈ సమాజపు పొకడలు
సాహిత్యము లేకపొతె సంగీతము సాగదు
సన్నిహితం పొసగకుంటె స్నేహమే నడవదు
ఎందుకీ సమస్యలు ఎవరివో తెలియదు
ఎందుకొచ్చామో ఏంచెస్తునామో ఎవరికెరుక
ఎందరెందరో వచ్చి ఎందరో చచ్చి
ఎందులోను జీవించక ఎప్పుడూ జవజచ్చి
ముగించిరి జీవితాన్ని ముంగిట్లో మదించక
మానవోత్తములు వీరీ వెర్రిగుడ్డి సమాజాన
మాధవోత్తములు రారు వీరిమడ్డి మదిలోన
వసుధైక కుటుంబం అవ్వాలి ప్రపంచం
వరమైఇక విరియాలి జాగృతాల పుష్పం
Comments
Post a Comment