నీ కర్మ నివృత్తి
ప్రస్తుతం వున్న కర్మను నివృత్తి చేసుకునే పనిలో వుంటే మళ్లీ కొత్త కర్మ చేయనవసరం రాదు; ఇక కొత్త పని చేయవు కూడా! ఇతరుల విషయాలలో తలదూర్చడం చాలా పాపం; దాని వలన వారియొక్క తలభారం, మనయొక్క భారం రెండూ మోయాలి.
ఇతరుల కర్మ స్వీకరణ:
ఇతర మనుషులయొక్క విషయాలలో ఇరికి, తన విషయాలు మరిచిపోయినవాడు చాలా ప్రమాదంలో వున్నట్లు లెక్క. అదే ఇతర కర్మలను తన కర్మలతో పోల్చుకుంటూ వేరే వారియొక్క కర్మ నివృతికి బాధ్యుడవడం చాలా మూర్ఖమైన మరియు అనాగరికమైన పని.
ఆధ్యాత్మిక భాషలో ఒకే ఒక్క విషయం చెప్పగలం. ఒక్క కర్మయే మన యొక్క జీవిత సర్వస్వాన్ని శాషించడం చేస్తుంది. జాగ్రత్త మిత్రమా! ప్రతీ అడుగులో రాళ్ళు ఎదురవుతుంటాయి; వాటికి జంకితే పని అవదు; వాటి గుండా వెళితే అపుడవి చిన్నబోతాయి.
Comments
Post a Comment