ప్రతీ మనిషి జన్మం, కర్మనే నులిపోగులతో, వారియొక్క అంతరంగంలో పేర్చబడిన దారపుండగా; ఈ వుండయే ప్రతీ క్షణమున మన కర్మను ప్రభావితం (క్రియలను) చేస్తుందని ఆలకిమ్పవచ్చును. ఒక యుగాంతంలో, కర్మపరిపక్వతకు చేరిన సమయమే, పరిణామ క్రమంలో నిష్కామ కర్మగా మారక తప్పని పరిస్థితి నెలకొనవచ్చును. ఇవన్ని ఊహలుగా మీరు తీసిపారేయవచ్చు. కాని ఇప్పడి పరిస్తితులలో ఇలాంటి సంగటనలు సర్వసాదరణాలు అని కరాకండిగా చెప్పవచును.
ప్రస్తుత పరిస్తితులలో భౌతికం చాలా పెద్దది, చాల కాస్త సాద్యమైన స్థితి, మరియు ప్రతీ మనిషికి అందని ద్రాక్ష అని సాధారణ మానవుని దృష్టి స్వభావం మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియపరచబడుతుంది. కానీ, ఒక్క నిజం గురించి మాట్లాడుకుంటే, ప్రకృతి విపత్తులతో మన భౌతిక సంపద నిమిషాల్లో నాశనం చేస్తుంది; మరి ఆ అశాశ్వతమైన సంపదను గూర్చి జీవితాంతం కష్టపడి, బాధపడి, తనను తానూ హింసించుకుంటూ, ఇతరులను కూడా హింసిస్తూ జీవించడం ఎంత మూర్ఖమో, మరియు ఎంత అజ్ఞానమో మనకు విడిగా చెప్పనవసరం లేదు.
జీవితం శాశ్వతం; జీవితపు క్రియలు ఆశాశ్వతాలు, మరియు క్రియా ఫలాలు శాశ్వతాలు కావు. ఒకసారి ప్రశ్నించుకో బాటసారి! ఎన్నో ప్రయాణాలు చేసావు నీ జీవ పరంపరలో! కానీ, ఎన్నింటిని అనుభూతికి తెచ్చుకున్నావు, మరియు ఎన్నింటిని సాధనలో పెట్టావు. ఇదంతా నీయొక్క కర్మ ప్రభావం. కొన్ని జీవితాలు ఏమి సాధించకుండానే వ్యర్థంగా గడిచిపోవచ్చు. ఇంకొన్ని జీవితాలు సత్యమని తెలిసినా, ప్రయత్నించ వీలుగాని వాళ్ళుగా మిగలవచ్చు.కానీ, కొన్ని జీవితాల సారం చెప్పేదేమిటంటే, ఫలించిన ఫలం ఎంత పరిపక్వత (జాగృత) స్థితికి చేరుతుందో, ఆ ఫలం అంతే తీయదనాన్ని(ప్రేమని), కమ్మదనాన్ని(దయ, మరియు కరుణని), మరియు సున్నితత్వాన్ని(అహింసని) ఇస్తుంది.
ఎలాగైనా కానీ మరి ఇదంతా చెప్పుకున్న తర్వాత, ఇందులోసారాంశం ఏమిటంటే, నీయొక్క కర్మను సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించే క్రమంలో ఇవన్నీ అనుభవం అవుతాయి. సాదన ఒక్కటే ఈ జ్ఞాన సంపదకు మార్గం. సాదన లేకపోతే అజ్ఞానం, అశాశ్వతం నీ చెంతకు చేరతాయి. కర్మ అనగా చేయడం, నీ అంతరంగంలో ఏదో ఒక్కదానికే చోటుంటుంది, జ్ఞానమా (లేక) అజ్ఞానమా! దానిని అధీష్టింపచేయడం నీ యొక్క భాద్యత (ధర్మం).
Comments
Post a Comment