Skip to main content

Posts

Showing posts from March, 2012

ఇతరుల గురించి సంభాషణ-కర్మ శిరోధారణ

నీ కర్మ   నివృత్తి   ప్రస్తుతం వున్న కర్మను నివృత్తి చేసుకునే పనిలో వుంటే మళ్లీ కొత్త కర్మ చేయనవసరం రాదు ; ఇక కొత్త పని చేయవు కూడా ! ఇతరుల విషయాలలో తలదూర్చడం చాలా పాపం ; దాని వలన వారియొక్క తలభారం , మనయొక్క భారం రెండూ మోయాలి . ఇతరుల కర్మ స్వీకరణ : ఇతర మనుషులయొక్క విషయాలలో ఇరికి , తన విషయాలు మరిచిపోయినవాడు చాలా ప్రమాదంలో వున్నట్లు లెక్క . అదే ఇతర కర్మలను తన కర్మలతో పోల్చుకుంటూ వేరే వారియొక్క కర్మ నివృతికి   బాధ్యుడవడం చాలా   మూర్ఖమైన మరియు అనాగరికమైన పని . ఆధ్యాత్మిక భాషలో ఒకే ఒక్క విషయం చెప్పగలం . ఒక్క కర్మయే మన యొక్క   జీవిత సర్వస్వాన్ని   శాషించడం చేస్తుంది . జాగ్రత్త మిత్రమా ! ప్రతీ అడుగులో రాళ్ళు ఎదురవుతుంటాయి ; వాటికి జంకితే పని అవదు ; వాటి గుండా వెళితే అపుడవి చిన్నబోతాయి .   

నా పరిసరాలు-మనుషుల ప్రవర్తనలు

ప్రతీ సమాజపు పరిసర స్థలాలలో ,   నాలా నాలోనే దాస్తూ ఎవ్వరికీ చెప్పుకోలేని కొన్ని కథలు ఉంటాయని   అనుకుంటున్నాను . ఇది ఎంతవరకు నిజమో నాకు అనుభవం లేదు . కాని , ఒక్కమాట చెప్పగలను . ఇంతమంది మనస్సు అనే , ఒక తుచ్చ ( నీచ ) మైన పని మనిషిలా వుండే , పరికరాన్ని యజమానిని చేస్తూ ... బానిస బ్రతుకులు బతకడం అనేది ప్రస్తుత మనిషి యొక్క బలహీనత . ఇదే మనిషియొక్క నమ్మకంగా :   జీవితమంతా తప్పులు చేస్తూ , అవే తప్పుల్ని ఇతరులతో చేయిస్తూ , మరియు ఇతరులకు తనయొక్క బురద రాయాలని ప్రయత్నిస్తూ వస్తున్నాడు . అసలు, సహజంగా ప్రకృతిలో నిజమేమిటి ( సత్యమేమిటి )? ఒకరిని ఒకరు ప్రేమతో చూడలేని జీవితం   ఆనందమైనదా ? ఒకరికి ఇంకొకరు సహాయం చేయలేని నాడు , ఈ సమాజం: సుఖమైన   భోగాలలో   తూలుతున్నరోజు , మనస్సు పరాకాష్టకు చేరినరోజు ఈ యొక్క విశ్వశాంతి ఎక్కడ్నుంచి వస్తుంది ?   ప్రస్తుత ప్రతీ మనిషి :   తనను ఎం   చేస్తున్నాడో , ఎందుకు ఇవన్నీ ( పనులు ) చేయాలో , ఎలా ఒక జీవి ఆనందంగా ఉండగలదో నేర్చుకోవడానికి సాధన అవసరం . లేదంటే ఈ జన్మలోనే కాదు ప్రతీజన్మలో తన

ధ్యాన్నం-జీవిత సమస్యా పరిష్కారం

ధ్యాన్నం   అసలు అంతరంగంలో ఏమీ ఉండకుండా , మన మనస్సు , మరియు   బుద్ధి ఏమీ చేయకుండా ; ఆలోచనలు ఆగిపోయినపుడు   అంతరంగపు అట్టడుగున కూడా ఎలాంటి కదలికలు లేకుండా శాంతంగా కర్మ నివృత్తి , దృష్టి కార్యం చేస్తూ ఉండడమే ధ్యాన్నం . మనస్సు - జీవితపుతడ్డంకి మనస్సు అల్పమైనది, మరియు అది ఒక అస్తిత్వాన్ని నిమిత్త మాత్రంగా, కొన్ని నిమిషాలసేపు ఆపగలదు . ఇలా ఈ మనస్సు మన జీవితం అంతా వృధా చేయడానికి ప్రయత్నిస్తుంది .  ఎపుడైతే అస్తిత్వం పరమాత్మతో కలిసినపుడు: అనంత , పరవశ , మరియు   శాంత ఆత్మానందం కలుగుతుంది ;  ఈ ప్రయత్నానికి భగవంతుడి సహకారం ఎల్లప్పుడూ వుంటుంది . ఇచ్ఛా త్యాగం - స్వాతంత్ర్యత సమాజంలో ప్రతీది నిన్ను తన దగ్గరకు తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించవు . నీవే నీ మీద ఆధిపత్యం లేక బానిసగా మారతావు ఇది సత్యం . శూన్య స్థితి - భైరవ స్థితి   ఎదుట మాటలాడేటప్పుడు , శూన్యంలోనికి ప్రయాణించడం ఒక క్రియ , అదే భైరవ స్థితి .  ప్రతిక్షణం , కనీసం ఒంటరిగా ఉన్నపుడైన శూన్యంలోకి వెళ్ళడం శ్రేయస్కరం . “ ప్రతీది కూడా శూన్యమనే భగవత్ స్థిత

కర్మ-ధర్మం

ప్రతీ మనిషి జన్మం, కర్మనే నులిపోగులతో, వారియొక్క అంతరంగంలో పేర్చబడిన దారపుండగా; ఈ వుండయే ప్రతీ క్షణమున మన కర్మను ప్రభావితం (క్రియలను) చేస్తుందని ఆలకిమ్పవచ్చును. ఒక యుగాంతంలో, కర్మపరిపక్వతకు  చేరిన సమయమే, పరిణామ క్రమంలో నిష్కామ కర్మగా మారక తప్పని పరిస్థితి నెలకొనవచ్చును. ఇవన్ని ఊహలుగా మీరు తీసిపారేయవచ్చు. కాని ఇప్పడి పరిస్తితులలో ఇలాంటి సంగటనలు సర్వసాదరణాలు అని కరాకండిగా చెప్పవచును.           ప్రస్తుత పరిస్తితులలో భౌతికం చాలా పెద్దది, చాల కాస్త సాద్యమైన స్థితి, మరియు ప్రతీ మనిషికి అందని ద్రాక్ష అని సాధారణ మానవుని దృష్టి స్వభావం మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియపరచబడుతుంది. కానీ, ఒక్క నిజం గురించి మాట్లాడుకుంటే, ప్రకృతి విపత్తులతో మన భౌతిక సంపద నిమిషాల్లో నాశనం చేస్తుంది; మరి ఆ అశాశ్వతమైన సంపదను గూర్చి జీవితాంతం కష్టపడి, బాధపడి, తనను తానూ హింసించుకుంటూ, ఇతరులను కూడా హింసిస్తూ జీవించడం ఎంత మూర్ఖమో, మరియు ఎంత అజ్ఞానమో మనకు విడిగా చెప్పనవసరం లేదు.      జీవితం శాశ్వతం; జీవితపు క్రియలు ఆశాశ్వతాలు, మరియు క్రియా ఫలాలు శాశ్వతాలు కావు. ఒకసారి ప్రశ్నించుకో బాటసారి! ఎన్నో ప్రయాణాలు చేసావు

ఉగాది (యుగాది) వేళ ప్రకృతి పరవశం

పరవశమే జీవితపు, చరమాంకపు సంగీతిక  నిశిగీతిక, సంధ్యారాగ పాళిక, శీతలవాయు వీ చిక; వసంత గాత్ర ధారిక, గంగా-గోదారి ప్రవాహా ల వసుధారిక; చేతక పక్షి పరంపర జీవిక, హంస  విచక్షణిక; మయూర నాట్య కళావిక, వృక్ష జాతు ల జీవిక మేఘసంఘర్షణాధిక్యతిక, మంజునాథ మాళిక; మాతృధరితృణ చెల్లిక, నా జీవన ఋతు రాగాల మల్లిక; జీవ భౌమిక.....!సంగీతిక.......... సంగీతిక.......సంగీతిక...................................!   -ఉగాది శుభాకాంక్షలు  మీ  భరత్ కుమార్ 

భౌతిక సమాజం-అవసరాలు

భౌతిక సమాజం-దాని మూలాలు  భౌతిక సమాజం మనస్సు యొక్క సంకల్పాలు, మరియు వాటియొక్క ఫలితాల వలన కొనసాగుతుంది; ఇదే లేకపోతే అందరూ శాంతంగా, సుఖంగా, మరియు ఆనందంగా బ్రతుకు సాగించేవారు.  అసలు నేనొక విషయం అడుగుతా ఎందుకు మనిషి సంకల్పించుకోవాలి, మరియు ఎందుకు ఆ ఫలితాలకు అనుగుణంగా (లేక) విరుద్ధంగా ప్రవర్తించాలి. ఇదంతా చూస్తుంటే మనస్సనే పరికరం ప్రతీ మనిషిని తనకు బానిసను చేసుకుని నిమిష, నిమిషానికి చిత్రహింసలు పెడుతూ; అసలు ఈ మనస్సు, మనిషి జీవితాన్నే అంధకారంలోకి తీసుకువెళ్ళి నరక ప్రాయంగా చేస్తుంది.  చివరగా, సమాజం-వాటియొక్క మూలాలను గురించి చెప్పుకుంటే అవి: రాజకీయం, వినోదం, మతం, భోగలాలసం, కర్మాగారసమూహం, క్రీడావినోదం, భౌతిక శాస్త్ర విద్య, ధన సంపాదన, విత్త విశ్లేషణ; ఇవన్నీ మనిషి యొక్క సంపూర్ణ ఆనందానికి ప్రతిబంధకాలు.  జీవితం-దాని యొక్క అవసరాలు  సాధారణంగా, మనిషి జీవితంలో-కడుపునిండా ఆహారం, ఒంటినిండా బట్ట, నివాసానికి ఇళ్లు అంతే. ఇంకా కోరుకోవడానికి ఏవి సాధారణాలుగావు.  స్వార్థం వలన అసహజ జీవితం అలవడుతుంది. ధనికులలోఈ స్వార్థం ఎక్కువ వుంట

భౌతికం-ఆధ్యాత్మికం

సమస్య భౌతికంలో   ఎన్నో   అవరోధాలు   ఎదురవుతాయి .   అవన్నీ   నీ   యొక్క   మరుక్షణానికి   ఉపయోగపడగలిగే   క్షణాలుగా   మార్చుకోవాలి. ఇదంతా   నీ   చేతుల్లోనే   ఉంటుంది .   నిస్పృహ   చెందకు   మిత్రమా !   నీయొక్క   ఆత్మ   విశ్వాసాన్ని   కోల్పోతే   సర్వం   కోల్పోయినట్టేనని   అర్థం   చేసుకో ... అనంత   ధైర్యంతో ,   నిరంతర   శ్రమతో ,   కోటి   నిరీక్షనలతో   సిద్దంగా   ఉన్ననాడు ,   నీయొక్క   మోక్షద్వారం   తెరుచుకుంటుంది .   ఇది   ఒక్కసారి   తెరుచుకుంటే   తర్వాత   మళ్లీ   అగాథంలోకి   వెళ్ళడం   జరగదు .  ఇది   సత్యం !   ఈ   మోక్ష   జాగృత   దివ్యచక్షువు   నీతో   నీలో   నీవుగా   ( నిరంతరం )   వెలిగితూనే   ఉంటుంది .  సమాధానం   ప్రతీ   అహంకారపు   క్రియకి   కృతజ్ఞతయే   చల్లార్పు ,   అలాగే   ప్రతీ   భయంకర   క్రియకి   సత్యమే   చల్లార్పు .   ఇంకా   చెప్పుకుంటే ,  ప్రతీ   లోభానికి   త్యాగమే   విరుగుడు ,   ప్రతీ   కోపానికి   నివృతియే విరుగుడు. ఇలాగే, ప్రతీ అసూయకి స్వయం ఆలోచనయే పరిష్కారం, చివరగా, ప్రతీ  కామానికి స్పృహయే పరిష్కారం. ఇవన్నీ విరుగుడులు, చల్లార్పులు, పరిష్కారాలు ఒక్క ధ్య