Skip to main content

Posts

Showing posts from June, 2012

సక్రియధ్యాన్నఅనుభవాలు-I

అంతరాత్మ మహాసందేశం    మీ మీ యొక్క ఆత్మ ఫరిదులు  అనేవి మీ యొక్క శక్తి అనులోమానుపాతం, విలోమానుపాతం లను బట్టి నిర్ణయించవచ్చు. సమస్త సృష్టి ఈ యొక్క శక్తిపాతం మీదనే జీవిస్తూ ఆధారపడుతున్నది. ఎప్పుడైతే ఈ అంతరాత్మ పరిపరి విధాల మనస్సు, శరీరం, బుద్ధి అనే వాటితో సంపర్కం చెందినపుడు కర్మ అనేది నిర్వర్తించబడుతుంది. అంతరాత్మ నుండి వచ్చే సందేశాన్ని బాహ్యక్రియగా మారకుండా శరీరం, మనస్సు, బుద్ధి అనేవి వాటి వాటి గుణాలననుసరించి ఆ సందేశాన్ని నిర్వీర్యం (తప్పుదోవ) గావిస్తాయి. దీని వలన ప్రతీ మానవుడు తను అనుకున్నది చేయలేక, సంతృప్తి కొరవడి మధ్యలోనే పరమపదిస్తున్నాడు.  ఈ యొక్క క్రియను సంపూర్ణం చేయాలంటే ముందుగా శరీరం శుద్ధి చేసుకోవాలి, మనస్సును శూన్యం గావించుకొని  మనో నియంత్రణ చేయాలి, చివరగా బుద్ధి ఎలాంటి పని లేకుండా చేయాలి. వీటి వలన అంతరాత్మ వార్త అనేది మన క్రియ (కర్మ) గా మారుతుంది. సక్రియ ధ్యాన్న అనుభవాలు-I   

ఆనందస్థితి-అంతఃశక్తి

  శక్తి అంతా నీలోనే వుంది, ఆ శక్తివల్లె అంతఃశక్తి యొక్క పరిణామ ఫలితాలు వెలువడతాయి. అవే ఆత్మానందాలు. ఇవి, వీటిని మించిన శక్తులు ఎక్కడా లేవు. ఈ శక్తే, అన్నింటిలో (భౌతికంలో) మనం వెతికేది ఆనందం. కాబట్టి ఈ దానివల్లే ఆ ఆనందం పుడుతుంది. భౌతికంలో దొరికే ఆనందాలు చిన్నవిగా వుంటాయి, కేవలం అవి మన మనస్సును మాత్రమే  రంజింపజేస్తాయి. కాని, ఆధ్యాత్మికంలో నీ అంతరంగంలోని శక్తి వాళ్ళ, దాని ఊర్ధ్వగమనం వలన నీకు ఆత్మానందం చేకూరుతుంది. ఈ ఆత్మానందం చాలా చెప్పలేని, అనగా,  (మామూలు ఆనందానితో పోలిస్తే)అనంతమైన  రెట్లు  వుంటుంది. ఇదే ప్రతీ జీవి తను తన కర్మలో సంతృప్తి వలన, సంభోగంలో సంతృప్తి వలన, తినడం వలన, త్రాగడం వలన, భౌతికమైన ఏ  క్రియవలననైనా తను ఆనందం పొందలేడు. కేవలం సుఖం, దుఖం మాత్రమే  పొందగలడు ఇది విశ్వసత్యం. ఎల్లప్పుడూ నీలో వున్నా ఆనంద స్ధితి (భైరవ-జాగృతస్థితి) లో వున్నప్పుడు నీకు భౌతిక (బాహ్య) మైన ఏ  కర్మతో  సంబంధం లేదు. ఎందుకంటే సుఖంలో అడుగు పెడితే దుఖం నీ వెంబడే వస్తుంది.   నీ అందం ఎంత ఎక్కువ రెట్లు ప్రదర్శించాలనుకుంటే వాటి వెంబడి నీడ అంత పెద్దదవుతుంది. భౌతికానందాలు  నీచమైనవి, అల్పమైనవి. ఆధ్యాత్మికా

మనస్సు

  మానవ మనస్సులు –పరిస్థితి మనుషుల మనస్సులు , వాటి లోతులు చాలా దూరం ; అవి అర్థమవడానికి జీవితం చాలదు . కాని , ఇది ఇంత లోతైనా , అది మారే పరిస్థితి చాలా ఎక్కువ . ఒక్కొక్క రోజూ , ఒక్కొక్క క్షణం , ఒక్కో పరిస్థితిలలో దాని మార్పులు చాలా అనివార్యం . ఇది ( మనస్సు ) ఎంతవరకు ఇలా స్థానభ్రంశం చెందుతుందో తెలియదు . కానీ ఒక్క విషయం చెప్పగలం . ఈ భౌతిక కాలం ఇప్పటికీ చాలా నీచ స్థితులతో నడపబడుతుంది . అసంబద్ధ క్రియలు - అసంబద్ధ   మనస్సులు మనస్సు అనేది చాలా సూక్ష్మమైన   క్రియా రూపం . ప్రతీ కదలిక , ప్రశాంతతలేనితనం , క్షణం తీరికలేనితనం.
Enlightenment Osho discourses Those who go on telling you to amend your nature and improve upon yourself are very dangerous people.They are one of the basic causes for your not being enlightened. Nature cannot be amended; it has to be accepted. There is no way to be otherwise. Whosoever you are, whatsoever you are, that's how you are -- that's what you are. It is a great acceptance. Buddha calls it tathata, a great acceptance. Nothing is there to be changed - - how can you change it, and who is going to change it? It is your nature and you will try to change it?   Nothing has to be changed, because all is beautiful -- that is enlightenment. All is as it should be, everything is perfect. This is the most perfect world, this moment lacks nothing -- the experience   of this is what enlightenment is. Jiddu Krishnamurthy teachings But see that the very state of dependence on  another may be the cause of the deep psychological  neurosis. When one breaks that pattern,

జాగృతి-ఎరుక క్షణాలు

ఆత్మ బోధ  జాగృతి :: సాధనామార్గం   మనస్సు తీవ్రమైన చావు స్థితికి చేరుకున్నపుడు , ఆలోచనల పరంపర లేదా ప్రవాహం ఆగిపోయినపుడు , మనలో ఒక నిశబ్ద , ఒంటరి , నిర్మల , నిత్య , శుద్ధ , బుద్ధ , మరియు   ఆరని జ్యోతి ఒకటి వెలుగుతూ వుంటుంది . ఈ వెలుగులోనే మన పనులు అన్నీ గమనించాలి , అలాగే ఏ పనిలో కూడా మునకలు వేయకూడదు . కేవలం చూపే మన ఇంధనం , చూపే మన సంపద అని అనుభవమైంది .  సమాజంలో వున్న   చెత్త అంతా కూడా ఒక చిటికెన వేలితో తుడిచివేయాలని ప్రయత్నిస్తే ఎం లాభం , ఆ చెత్తనంతా ఒక జ్ఞాన జ్యోతి సమక్షంలో కాల్చివేయాలి . ఈ దహన సంస్కారం మన పూర్వ రూప క్రియలకు మరియు కర్మలకు అవసరం .  ముందు మన  కర్మలు నశిస్తే, ఇతర  సమాజపు పట్టింపులు అనేవి చేయగలం. ఇదిగాక, మన  తలనొప్పి ఇతర తల నొప్పులూ, రెండూ ఒకేసారి భరించడం అసాధ్యం. ఈ ప్రక్రియ ఒకేసారి రెండు పడవల మీద  ప్రయాణించడంలాంటిది.  జాగృత  క్షణాలు, మనం మన  జన్మతహా నేర్చుకున్న, నేర్పబడిన  విషయాలు, సంస్కారాలు, మరియు అసంబద్ద  క్రియలూ అన్నీ  త్యాగం చేయాలి. ఈ యొక్క త్యాగంలోనే మన  జ్ఞానజ్యోతి మేల్కొంటుంది, చివరగా మనకు సత్యం గో

సంగీతం

సంగీతం -   హృదయాలను కలిపే ఏకైక సాధనం   హృదయ భావఝారి ఆగదు ఏనాటికీ సంగీత రసభావం వశమైతే , భావ రాగ మేలి కలయిక జీవనాదాల సంయోగ కేళీ నీకనుభావమైతే , ఇవ్వన్నీ వశమైతే అనుభూతి చెందగలవు అందుకే , ఆగదు ఈ భావఝారి , నా యొక్క హృదయ కుసుమాంజలి , అదే ఈయొక్క భావ - రాగ - అనుభవ రాగమాలళిక   

మహాత్ముల పరిమళ వాక్కు

మన ఆధ్యాత్మిక గురువులు-భావనలు  తిరువళ్ళువర్  చలించే మనస్సును చిక్కబట్టి నిబ్బరం తెచ్చుకుని తేరి చూస్తే చాలు, సముద్రమంతటి కష్టాలు కూడా తోక ముడుస్తాయి. - తిరువళ్ళువార్  బుద్ధుడు  శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే జరిగిపోయిన దానికి విచారించకూడదు, జరగబోయేదానికి అందోళన  పడకూడదు. వర్తమానంలో వివేకంతో, నిజాయితీతో జీవించాలి.- బుద్ధుడు  మంచి గంధం పరిమళంకానీ, మల్లెపూల సుగంధంకానీ గాలికి ఎదురువెళ్ళలేవు. మనిషిలో మంచి గుణాల పరిమళం మాత్రం గాలికి ఎదురునిలిచి వ్యాపించగలదు. - దమ్మపదం (బుద్ధ)

ధ్యాన్న రహస్యం

అనారోగ్య శరీరం-శక్తి స్వీకరణం  ధ్యాన్నంలో శ్వాస పరిశుద్ద వాయువును మన అంతః శరీరంలో నిరంతరం ప్రవేశపెడుతూ వుంటుంది. ఈ వాయువునే శివ స్వరూపం అంటారు. షరా మామూలే! జలంతో శరీరాన్ని (పొట్ట) నింపినప్పుడు శ్వాస (విసర్జక) వాయువులు బయటకు నవరంద్రాల ద్వారా బయటకు వెళతాయి. ఈ ప్రక్రియ వలన అంతరంగం, బాహ్యం రెండు పరిశుద్ధం అవుతాయి.  శక్తి స్వీకరణం-శరీర పరిశుద్ధం  శ్వాస పరిశుద్ధం-అంతరంగం మనో నియంత్రణం-దివ్యచక్షు ఆవిర్భావం-హృదయాత్మ శక్తి స్వీకరణం-అతీంద్రియ శక్తి స్వాధీనం-పరమాత్మయే గమ్యం-ఆత్మానందం-అంతఃశాంతి-మోక్షం.  

నీ జీవితం ఒక స్వాతంత్ర్య ప్రయాణం

స్వాతంత్ర్య ప్రయాణం  నీ జీవితంలో ప్రతీ క్షణం నీ యొక్క, నీకివ్వబడిన అస్తిత్వ సమూహం. ఈ ప్రస్తుత క్షణాలు పూర్తిగా నీ చేతుల్లోనే వున్నాయి.  నీ జీవిత ప్రయాణoలో జరిగే ప్రతీ క్రియకి నీయొక్క కర్మయే కారణం. నీ కర్మని లేదా నీ కర్మకి నీవే బాధ్యుడవు. ఇచ్చా త్యాగం వలన మనస్సు శూన్యమౌతుంది. దాని పరిణామమే నీ యొక్క కర్మాస్వాతంత్ర్యం.ఈ యొక్క స్వాతంత్ర్యమే నీయొక్క ఆత్మవికాసానికి, ఆత్మ పునర్వికాసానికి, ఆత్మ శక్తి పునర్నిర్మాణానికి , ఆత్మత్యాగ ఫలితమే ఆత్మ జ్ఞానమునకు మరియు ఆత్మ నిగ్రహానికి ప్రతీకలు. జీవన ప్రయాణం జీవన ప్రయాణంలో ఇతరులతో నీకు సంపర్కం అవసరమని నేను చెప్పలేను. ఇతరుల మాటల ప్రభావాన్ని పూర్తిగా విస్మరించాలి. అవసరమనుకుంటే మాట్లాడాలి , లేదా పూర్తి నిశబ్దాన్ని పాటించాలి. ఈ మౌనమే నీ యొక్క అంతరాత్మ శుద్ధికి దోహదం చేస్తుంది. మిగతావన్నీ ఆటరిక క్రియలు, హాస్య ప్రక్రియలు. అస్తిత్వం -విలువ  "విలువైన వజ్రరత్నం లభించగానే గులకరాళ్ళతో ఆడుకోవడం తప్ప ఏమి చేస్తావు." అంతఃస్థితి అనే బంగరు అస్తిత్వ రుచి చూసినపుడు మిగతా భౌతిక-మానసిక అవస్తలు పూర్తిగా క్రీడా ప్రక్రియలు అనేది సత్యం! ఇదే వాడకం.