కర్మ ఒక క్రియారూప చర్య అని చెప్పుకోవచ్చు; అంటే దీనిని ఇంకా స్పష్టంగా చెప్పుకుంటే: ఒక క్రియ యొక్క ఫలాన్ని ఆశించకుండా, నిజాయితీగా చేసే కృషియే కర్మ. ఎన్నో నిర్వచనాలని కలిగివున్న కర్మను చెప్పడం ఒక రకంగా కష్టతరమే.
కర్మ ఎలా చేయాలి?
కర్మను ప్రతీ ఒక్కరు నిర్వర్తించడం సహజం కాని ఆ కర్మను సరియైన దారిలో నడిపిస్తూ విజయవంతం అవడం కష్టతరం; సరియైన దారి ఏంటో వారి యొక్క అంతరాత్మ సందేశాన్ని బట్టి అందరికి అనుభవమవుతుంది, మనం దాని గురించి వేరే చర్చిన్చుకోనవసరం లేదు; మళ్లీ ఆ దారి ప్రతీ ఒక్కరి కర్మ ప్రవృత్తిని, మరియు క్రియా ఫలాసక్తిని బట్టి ఒకరు నిర్ణయించుకోవాల్సి వస్తుంది.
క్రియ అనగా ఏమిటి?
క్రియ అంటే కర్మయొక్క పరిణామ చర్య అని చెప్పుకోవచ్చు;
మనిషిలో మూడు తలాలు: శరీరం, మనస్సు, బుద్ధి, మరియు ఆత్మ అని ఉంటాయి; ప్రతీ ఒక్క తలానికి ఒక విశిష్టత వుంది. ఇంకా చెప్పుకుంటే ఈ మానవ తలాల గురించి ఇప్పుడు చర్చించడం అప్రస్తుతం; ఐతే, వీటి యొక్క కర్మను గురించి చెప్పుకుంటే ప్రతిదీ ఒక కర్మ-క్రియ వాహకం అనవచ్చు; వీటి ద్వారే మన కర్మ సంచితాలు ఆధారపడి వుంటాయి, అలాగే క్రియారూపాలు కూడా ఆధారపడతాయని అనవచ్చు.
Comments
Post a Comment