ప్రస్తుతం మనిషి సమాజంలో ఎలా
జీవిస్తే ఆనందం లభ్యమౌతుందో అదే ఆనందం శాశ్వతంగా ఎలా ఉండగలుగుతుందో అని ప్రతిక్షణం వెంపరలాడుతున్నాడు. ఈ మనిషి యొక్క తృష్ణయే మనస్సనే (అపసవ్య) కేంద్రం ఆదిగా
మానవ జీవితాన్ని శాషించే దశకి వెళుతూ; తనను తానూ మరిచిపోతూ వున్నాడు. అజ్ఞానమనే
చీకటిలో ప్రతీ క్షణం తప్పులు చేస్తూ, మరియు ఇతరులతో
అప్రయత్నంగా చేయిస్తూ, ఇలా ఆ అజ్ఞాన తిమిర సాగరం యొక్క ఇంకో చివరి స్థానం వరకూ
మనిషి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ ప్రయాణం సాగుతున్నంతసేపు ఇంక తన అస్తిత్వం ఒకటుంది అని, తనతో దేవుని మూల కణం వుందని
గ్రహింపక సర్వ కష్టతరమైన కర్మలను చేయననుభావిస్తాడు. ఈ తెలియని కోణమే అజ్ఞానమునకు కారణమౌతుంది.
సూర్య(ఆత్మ)ప్రకాశం-పుష్ప(హృదయ)వికాసం
ప్రకృతి ధర్మం ప్రకారం ప్రతీ
జీవి: సహజంగా, ప్రకృతికి
అనుగుణంగా, పరశంతో, ప్రతీక్షణం ఇతర జీవులను ప్రేమిస్తూ, మరియు అపేక్షిస్తూ వస్తూన్నప్పుడు
ఒకానొక సమయంలో ప్రేమ పుష్పం వికశిస్తుంది; ఆ వికాసమే ఆత్మయొక్క అనుగ్రహం (ప్రకాశం)గా భావింప
వచ్చును. ఆత్మ
(సూర్యుని) యొక్క ప్రకాశ (జ్ఞాన)మే పరిపూర్ణమైన, మరియు స్వచ్చమైన జ్ఞానము
(వెలుతురు)ను అందింపచేస్తూ నిర్మల-నిష్కల్మషమైన ప్రేమ(సువాసన)ను వెదజల్లుతుండునని భావం.
Comments
Post a Comment