ధ్యాన్నయోగం-ఓషో
నువ్వు పరిపూర్ణం (సత్యం) కాలేదు; నీకు వాస్తవ రూపం రాలేదు. ఇలా అయితే ఎలా చెప్పుతావు సత్యం ఉందని; సత్యమే నిజమైన అనుభవమని. నువ్వు ఎవ్వరినీ ఏమి చేయలేవు; ఎవ్వరినీ మార్చలేవు. వారు వారికి ఉన్న స్వేచ్చ ప్రకారం వారి క్రియలు జరుగుతుంటాయి. ఎవరి స్వేచ్చ వారికుంది; ఎవరి స్వేచ్చను ఎవ్వరూ తీసుకోరు/పాడు చేయలేరు. సత్యం చెబితే ఒంట పట్టదు, అది తనకు తాను అనుభవం ద్వారా తెచ్చుకుని తెల్సుకుంటే, మరియు సత్యాన్ని చూస్తేగాని విశ్వసించడం కుదరదు.
వ్యాఖ్య
నువ్వు ఎన్ని కారణాలైన చెప్పు, ఎంత తర్కమైన చెయ్యు ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే, మనస్సు పని చేసేటప్పుడు అంతరంగానికి చోటు ఎక్కడిది; ఎలా వినగలుగుతుంది మన అంతరంగం. నిరంతర మనః ప్రవాహాలతో, చిక్కుముడులతో విడదీయరాని, మరియు విడదీయరాలేని పెద్ద పెద్ద శక్తి యొక్క సమ్మేలనాలతో; సముద్రమంతా విశాలమైన చెత్తతో, అలల ఉధృతికి ఎగసిపడే సముద్రంలా; మన మనస్సు ఆలోచనల ఉదృతికి ఎగసిపడుతూ ఒక కుదురు లేకుండా, కుదుపే ఆటగా, నిరంతరం నిడివి లేకుండా సాగుతూనే ఉంటుంది.
ఈ విపత్కర సమయంలో, ఇలాంటి స్థలంలో, ఇలాంటి సాంగత్యంలో ఎలా నేర్వగలం ఆత్మ విద్యని; ఎలా చూపగలం సత్యాన్ని. సత్యాన్ని చూపించలేం గానీ అదే సత్యాన్ని తనకు తానే చూడగల్గవచ్చును. ఈ యొక్క ప్రక్రియకు ధ్యాన్నమొక్కటే మార్గము. ఒకరికి మార్గం చూపగలం, కాని ప్రయాణం చేయించలేం; ప్రయాణం ఎవరికి వారే చేయాలి మరియు ఎవరికి వారే సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క సత్య సంధతా ప్రక్రియకి ధ్యాన్నమొక్కటే ఉత్తమమైన మార్గం, ఇందులో: మార్గ దర్శకుడే ఆత్మ, మార్గ సహాయకుడే మనస్సు, మార్గ వాహనమే శరీరం, మరియు మార్గ రాయబరియే శ్వాస అని అనుభపూర్వకంగా చెప్పవచ్చును.
Comments
Post a Comment