ఆత్మ బోధ
- మనస్సు తీవ్రమైన చావు స్థితికి చేరుకున్నపుడు, ఆలోచనల పరంపర లేదా ప్రవాహం ఆగిపోయినపుడు, మనలో ఒక నిశబ్ద, ఒంటరి, నిర్మల, నిత్య, శుద్ధ, బుద్ధ, మరియు ఆరని జ్యోతి ఒకటి వెలుగుతూ వుంటుంది. ఈ వెలుగులోనే మన పనులు అన్నీ గమనించాలి, అలాగే ఏ పనిలో కూడా మునకలు వేయకూడదు. కేవలం చూపే మన ఇంధనం, చూపే మన సంపద అని అనుభవమైంది.
- సమాజంలో వున్న చెత్త అంతా కూడా ఒక చిటికెన వేలితో తుడిచివేయాలని ప్రయత్నిస్తే ఎం లాభం, ఆ చెత్తనంతా ఒక జ్ఞాన జ్యోతి సమక్షంలో కాల్చివేయాలి. ఈ దహన సంస్కారం మన పూర్వ రూప క్రియలకు మరియు కర్మలకు అవసరం. ముందు మన కర్మలు నశిస్తే, ఇతర సమాజపు పట్టింపులు అనేవి చేయగలం. ఇదిగాక, మన తలనొప్పి ఇతర తల నొప్పులూ, రెండూ ఒకేసారి భరించడం అసాధ్యం. ఈ ప్రక్రియ ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణించడంలాంటిది.
- జాగృత క్షణాలు, మనం మన జన్మతహా నేర్చుకున్న, నేర్పబడిన విషయాలు, సంస్కారాలు, మరియు అసంబద్ద క్రియలూ అన్నీ త్యాగం చేయాలి. ఈ యొక్క త్యాగంలోనే మన జ్ఞానజ్యోతి మేల్కొంటుంది, చివరగా మనకు సత్యం గోచరిస్తుంది. ఈ సత్యపు వెలుగులలో మన అజ్ఞానం పూర్తిగా నాశనం అవుతుంది, ఇదే మేలుకొలుపు, ఇదే జాగృతి, ఇదే ఇంకో విధంగా మన జీవనం.
- వెలుగుతున్న జ్యోతిని కొన్ని రోజులు గమనిస్తూ వుంటే ఒక నాటికి అది పూర్తి వెలుగై నీ అస్తిత్వమే వెలగతం లేదా గమనించడంగా మారిన నాడు నీకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది. మన ఎరుక జ్యోతిలో ఈ యొక్క సంస్కారాలు అన్నీ కూడా అడ్డుగోడల వలెనున్న, వాటి స్వరూపాలు అంతరించడం మొదలవుతుంది. ఈ కదలికలే మన యొక్క మోక్ష మార్గపు చలనాలు అనవచ్చు.
- మంచు గడ్డల ప్రపంచం మన భౌతిక జీవితం, సముద్ర రూపం మన అంతరంగం; ఈ రెండూ కూడా మన విశ్వరూప అస్థిత్వంలోనే నెలకొని వున్నాయి అని చెప్పవచ్చు. ఈ విశ్వ అస్తిత్వం ఈ యొక్క మహా సముద్రం అనుకోవచ్చు. మనం తీవ్ర ధ్యాన్న స్థితిలోకి వెళ్ళినపుడు మన అంతరంగం ఈ యొక్క మంచు గడ్డలనే అవరోధాలను (శక్తి పుంజాలను) కరిగించడం చేస్తుంది, దీని యొక్క పరిణామమే మన అంతరంగ గంగా ప్రవాహం మనకు తెలియకుండా పారడం జరుగుతుంది. తుదకు, ఈ ప్రవాహమే వుద్రుతమై ఒక్క మంచు గడ్డ కూడా మిగలకుండా కేవలం ఒక ప్రవాహం మాత్రమే మిగులుతుంది. ఈ ప్రవాహమే మన యొక్క అంతరంగ అస్తిత్వ స్వరూపం ఇదే అమాయకపు, నిశ్సబ్దపు, నిర్మలమైన, శుద్దమైన స్వరూపం-ఆత్మ స్వరూపం.
- అంతరం: అంతరంగంలో బయటి ప్రకృతి అస్తిత్వాన్ని అనుభూతి చెందినపుడు నీలో నిశబ్దం తప్ప ఇంకేమియూ లేదని చెప్పవచ్చును. లోపల ఖాళీగా వుంటే భగవత్ స్వరూపమైన ప్రకృతి అస్తిత్వమే దైవ రూపమై అనుభూతమౌతుంది.
- బాహ్యం: బాహ్య ప్రకృతి గూర్చి చర్చించడం, చెప్పుకోవడం, తర్కించడం, వాదోపవాదనలు చేయడం, వీధి కుక్కల్లా అరవడం, ఊర పందుల్లా కీచులాడుకోవడం, వానరాలలా గెంతులు వేయడం, దున్నపోతుల్లా కోట్లాడుకోవడం, మరియు పిల్లుల్లా గింజుకోవడం పైవన్నీ జంతు స్వభావం కలిగిన పరిణతి చెందని మానవ జాతి వలననే సాధ్యం.
- సత్యమైన అస్తిత్వం, తనయొక్క చివరి తొడుగు అహంకారం వదిలితే ఆ అస్తిత్వమే భగవధస్తిత్వ స్థితికి చేరుకుంటుంది.
Comments
Post a Comment