అంతరాత్మ మహాసందేశం
- మీ మీ యొక్క ఆత్మ ఫరిదులు అనేవి మీ యొక్క శక్తి అనులోమానుపాతం, విలోమానుపాతం లను బట్టి నిర్ణయించవచ్చు. సమస్త సృష్టి ఈ యొక్క శక్తిపాతం మీదనే జీవిస్తూ ఆధారపడుతున్నది.
- ఎప్పుడైతే ఈ అంతరాత్మ పరిపరి విధాల మనస్సు, శరీరం, బుద్ధి అనే వాటితో సంపర్కం చెందినపుడు కర్మ అనేది నిర్వర్తించబడుతుంది.
- అంతరాత్మ నుండి వచ్చే సందేశాన్ని బాహ్యక్రియగా మారకుండా శరీరం, మనస్సు, బుద్ధి అనేవి వాటి వాటి గుణాలననుసరించి ఆ సందేశాన్ని నిర్వీర్యం (తప్పుదోవ) గావిస్తాయి. దీని వలన ప్రతీ మానవుడు తను అనుకున్నది చేయలేక, సంతృప్తి కొరవడి మధ్యలోనే పరమపదిస్తున్నాడు.
- ఈ యొక్క క్రియను సంపూర్ణం చేయాలంటే ముందుగా శరీరం శుద్ధి చేసుకోవాలి, మనస్సును శూన్యం గావించుకొని మనో నియంత్రణ చేయాలి, చివరగా బుద్ధి ఎలాంటి పని లేకుండా చేయాలి. వీటి వలన అంతరాత్మ వార్త అనేది మన క్రియ (కర్మ) గా మారుతుంది.
Comments
Post a Comment