మనస్సు-ఆంతర్యం (నా స్వానుభవం)
మనసా నీకు మోహమేల, నీదికాని దాని కోసం లోభమేల
మన ప్రకృతిపై ఖేదమేల, మనుషుల మీద బేధమేల
అజ్ఞానపు చీకటిలో నీవు రాజ్యమేల ప్రయత్నిస్తున్నావు సృష్టికి మేల
అవుధులున్నాయి నీకు సందేహమేల అవసరం లేదందుకే నీతో ఎల్లవేళలా
ఆత్మ తత్వంబుజూసి జడుసుకున్నవేల, ఆత్మానుభవమే నీకు మరణమనేలా
ఏదీ నీదికాదు ఎరుగవేల, అది ఎరింగిన వేల నీ చావు తథ్యమిలా
మనసా అజ్ఞానపు మరక తుడుచవేల
జ్ఞాన మార్గములోన ప్రవేశించవేల...
Comments
Post a Comment