జీవితానుభవం-గుప్త విషయం
ధ్యాన్న సాధనలో వచ్చే అనుభవాలను ఎవ్వరికీ చెప్పుకోలేని స్థితి ఒక సాధకుడిది. విశ్వంలో ఎన్నో అందమైన పరిక్రియలు జరుగుతుంటాయి, అలాగే మన అంతరంగంలో అనుభవ క్రియలనేవి పరిమాణ దశలో జరుగుతుంటాయి. విశ్వ రూపం చూపలేని ఈ స్థితి, అంతరంగంను ఎలా చూపగలుగుతుంది...చూపలేదు! ఎందుకంటే భౌతికమే చూడ అర్హత లేని మనిషికి ఆధ్యాత్మికం చూపాలని ప్రయత్నించడం, వాడు చూడాలని అనుకోవడం మూర్ఖం. అర్హత ఒక్కటే అదే అంతరంగ శుద్ధి, అదే మన యొక్క ప్రకృతి స్వభావ స్థితి. ఇది నిర్మలం, నిశబ్దం, నిర్వేదం, నిజం, నిత్యం, నిబద్దం, మరియు నిత్య సత్యం.
- శరీరం ద్వారా చర్యలు, మనస్సు ద్వారా చలనాలు, హృదయం ద్వారా భావనలు నిలిచిపోతాయి, ఈ సమయాన నిశబ్దం రాబడుతుంది.
- శరీరం-జడం; మనస్సు-సున్నితం; హృదయం-అత్యంత సున్నితం; ఆత్మ-నిర్మలం, నిత్యం, మరియు నిజం.
Comments
Post a Comment