- శక్తి అంతా నీలోనే వుంది, ఆ శక్తివల్లె అంతఃశక్తి యొక్క పరిణామ ఫలితాలు వెలువడతాయి. అవే ఆత్మానందాలు. ఇవి, వీటిని మించిన శక్తులు ఎక్కడా లేవు. ఈ శక్తే, అన్నింటిలో (భౌతికంలో) మనం వెతికేది ఆనందం. కాబట్టి ఈ దానివల్లే ఆ ఆనందం పుడుతుంది.
- భౌతికంలో దొరికే ఆనందాలు చిన్నవిగా వుంటాయి, కేవలం అవి మన మనస్సును మాత్రమే రంజింపజేస్తాయి. కాని, ఆధ్యాత్మికంలో నీ అంతరంగంలోని శక్తి వాళ్ళ, దాని ఊర్ధ్వగమనం వలన నీకు ఆత్మానందం చేకూరుతుంది. ఈ ఆత్మానందం చాలా చెప్పలేని, అనగా, (మామూలు ఆనందానితో పోలిస్తే)అనంతమైన రెట్లు వుంటుంది. ఇదే ప్రతీ జీవి తను తన కర్మలో సంతృప్తి వలన, సంభోగంలో సంతృప్తి వలన, తినడం వలన, త్రాగడం వలన, భౌతికమైన ఏ క్రియవలననైనా తను ఆనందం పొందలేడు. కేవలం సుఖం, దుఖం మాత్రమే పొందగలడు ఇది విశ్వసత్యం.
- ఎల్లప్పుడూ నీలో వున్నా ఆనంద స్ధితి (భైరవ-జాగృతస్థితి) లో వున్నప్పుడు నీకు భౌతిక (బాహ్య) మైన ఏ కర్మతో సంబంధం లేదు. ఎందుకంటే సుఖంలో అడుగు పెడితే దుఖం నీ వెంబడే వస్తుంది.
- నీ అందం ఎంత ఎక్కువ రెట్లు ప్రదర్శించాలనుకుంటే వాటి వెంబడి నీడ అంత పెద్దదవుతుంది.
- భౌతికానందాలు నీచమైనవి, అల్పమైనవి. ఆధ్యాత్మికాలు ఎల్లప్పుడూ సత్యమైనవి, సంతృప్తికరమైనవి, శాశ్వతమైనవి.
- భౌతికంలో క్రియలు చేయు! ఆధ్యాత్మికంలో అవస్థ వచ్చేంతవరకు. ఒకే సమయంలో పూర్తి ఆధ్యాత్మికత నీకు చెప్పకనే వస్తుంది. అదే భైరవస్థితి.
కవిత్వం-మేలుకొలుపు అలుపు సొలుపు లేదు నీకు కలుపు సలపగా గెలుపు మలుపు తిరిగితేనే కలుపు గెలుపుగా మౌనవలపు వీడితేనే పరుపు ప్రేమగా ప్రేమ తలపు విరహంబున సలుపు గెలుపుగా బలుపు చెరుపు యవ్వనంబున తెలుపు నిజములుగా తూరుపు సూర్యునకిదేనో మేలుకొలుపుగా...మేలుకొలుపు...
Comments
Post a Comment