Skip to main content

నిగ్రహం-నిర్వాణం

నిగ్రహం-నిర్వాణం 
_________________________________________________________________________________

నిగ్రహమ్ము వీడరాదు నిజమదిగనకా
నిష్టూరము నమ్మరాదు నిర్జీవముగనక

నిజమును నిలువరించుట నీతిలోని వింత
నిర్జీవము నిజమవదునది అతుకుల బొంత

నిర్ణయ నిర్దేశితాలు నీ ఫరిదికి రాబోవిక
నిర్దయ నిర్వేదము నీలో నిలువనీయదిక

నిరాభ్యంతరాంతరాలు నీకనవసరమ్మిక
నిర్గుణ నిజరూపముల్  నీకు నిర్వాణమ్మిక

_________________________________________________________________________________

Comments