జీవితము ఆధ్యాత్మికం ప్రాపంచికం అని వేరు చేయనంత పెద్ద విషయం. మనకి ఎలాగైతే ఎంతో మృదువైన కొబ్బరి లేదా కొబ్బరి నీళ్లు ఆ కాయలో ఉండాలంటే దాని పైనున్న కొబ్బరి టెంక పీచు మరియు నీటిని కూడా వెళ్లనివ్వని పలుచని పచ్చ కవచం అవసరమో ఈ సమాజం లో ఆధ్యాత్మిక పదార్థమైన ఆత్మ లేదా సత్వాహంకారం మనలో పదిలంగా నిలవాలంటే ఏంటో కొంత పదునైన టెంకలాంటి ఆర్ధిక ఉన్నతి కలగాలి అలాగే సంఘ గౌరవం అనే పీచు ఐక్యత అనే పచ్చ కవచం కావాలి. ఇది నా జీవిత సత్యం.
కవిత్వం-మేలుకొలుపు అలుపు సొలుపు లేదు నీకు కలుపు సలపగా గెలుపు మలుపు తిరిగితేనే కలుపు గెలుపుగా మౌనవలపు వీడితేనే పరుపు ప్రేమగా ప్రేమ తలపు విరహంబున సలుపు గెలుపుగా బలుపు చెరుపు యవ్వనంబున తెలుపు నిజములుగా తూరుపు సూర్యునకిదేనో మేలుకొలుపుగా...మేలుకొలుపు...
Comments
Post a Comment