నిగ్రహం-నిర్వాణం
_________________________________________________________________________________
_________________________________________________________________________________
_________________________________________________________________________________
నిగ్రహమ్ము వీడరాదు నిజమదిగనకా
నిష్టూరము నమ్మరాదు నిర్జీవముగనక
నిజమును నిలువరించుట నీతిలోని వింత
నిర్జీవము నిజమవదునది అతుకుల బొంత
నిర్ణయ నిర్దేశితాలు నీ ఫరిదికి రాబోవిక
నిర్దయ నిర్వేదము నీలో నిలువనీయదిక
నిరాభ్యంతరాంతరాలు నీకనవసరమ్మిక
నిర్గుణ నిజరూపముల్ నీకు నిర్వాణమ్మిక
Comments
Post a Comment