దృష్టి-సృష్టి
_________________________________________________________________________________
_________________________________________________________________________________
_________________________________________________________________________________
ధనకనక వస్తువులవి దరిచేరవు దివిటీలకు
దైవత్వపు దివితీలవి దారుణ దాష్టికాలుగావు
దర్పమదలని వానికి దారుణ మరణం తప్పదు
దర్పణమయిన వానికి ధారణ దరి తప్పదు
దగ్గరున్న వానికిని దూరపు దృష్టి మానదు
దూరమునున్న వానికి దురాద్రుష్టి వీడదు
దూరదృష్టి కలవానికి దృగ్గోచరమౌను సృష్టి
దురాద్రుష్టి గలవానికి దౌర్భాల్యమౌను సృష్టి
Comments
Post a Comment