Skip to main content

గురువు-శిష్యుడు

గురువు-శిష్యుడు 
_________________________________________________________________________________

గురువు గురువు కాదు గూఢ రహస్యము విప్పక
గుర్తెరుగక గురువు తను విద్యార్ధి ననుగానక

శిష్యులంటే రాజుకు శిస్తు కట్టే బానిసలవక
శౌర్యమున్నా శిష్యుల్  గురుగౌరవము మిన్నక

పరివర్తించు నీ పరివారము ప్రేమతోనిక
పరిపరి విధముల పరిపాలనములనెంచక

గౌరవమ్ము గోరవద్దు గురుభక్తినినెంచక
గౌరవమ్ము లీడవద్దు గార్ధభ కర్మజేసిన

_________________________________________________________________________________ 

Comments